Malli Pelli Movie: సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమాని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.నరేష్ తన వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా ఈ సినిమా ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.
నరేష్ ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకొని ముగ్గురు భార్యలను వదిలేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ముగ్గురు భార్యలను వదిలేసిన ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం గురించి మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారని ఈ సినిమాకు ఈయన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ తిరిగి ప్రారంభించి నిర్మాతగా వ్యవహరించారని కూడా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల పాత్రలు కూడా ఉండబోతున్నాయని ఇందులో కృష్ణ పాత్రలో శరత్ బాబు విజయనిర్మల పాత్రలో జయసుధ కూడా నటించారు. అయితే ఇది కృష్ణ కుటుంబ విషయానికి సంబంధించినది కావడంతో మహేష్ బాబు పాత్ర కూడా ఇందులో ఉండబోతుందని చాలామంది భావించారు. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి మళ్లీ పెళ్లి టీమ్ స్పందించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు పాత్ర గురించి చిత్ర బృంధం నుంచి వస్తున్న సమాచారాలను బట్టి.. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఉంటుంది కానీ డైరెక్ట్ గా లేకుండా కేవలం మాటల్లో మాత్రమే మహేష్ బాబుని ప్రస్తావించే లాగా అతని పాత్ర ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకులలో భారీ హైప్ పెంచారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆత్రుతగా కూడా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…