Tag Archives: Maniratnam

రాజమౌళికి నేను అవసరం లేదు.. నన్ను అర్ధం చేసుకోకుండా 6 సార్లు బ్యాన్ చేసారు : ప్రకాష్ రాజ్

దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. ప్రస్తుతం అతడు దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నటుడిగా ఏ పాత్రకైనా న్యాయం చేస్తాడు ప్రకాష్ రాజ్. అటు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా కూడా ఎన్నో సినిమాలు చేశారు.అతడు రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన నటుడు ప్రకాశ్ రాజ్.

ఇప్పటి వరకు నాలుగు జాతీయ అవార్డులను అందుకున్నాడు. నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యుయెట్’. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. ‘కాంచీవరం’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ప్రకాష్ రాజ్ హిస్టారికల్ సినిమాలు పెద్దగా ఎందుకు చేయలేదు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ప్రకాష్ రాజ్ సమాధానం చెబుతూ.. ఇప్పుడు పెద్దగ హిస్టారికల్ సినిమాలు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. చాలా కొద్ది మంది చేస్తున్నారు అందులో రాజమౌళి ఒకరు. అయితే ఆయన సినిమాకు నా అవసరం పడలేదు అందుకే నాకు అయన సినిమాలో క్యారెక్టర్ ఇవ్వలేదు అని చెప్పారు.. అయితే ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ప్రకాష్ రాజ్ ను ప్రోడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఆరు సార్లు బ్యాన్ అయ్యారు.

దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ఇలా సమాధానం చెప్పాడు. అన్ని భాషలకు సంబంధించిన ప్రోడ్యూసర్ కౌన్సిల్లో ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోయారు.. ఎందుకు మిమ్మల్ని ఆ కౌన్సిల్ నుంచి ఆరు సార్ల బ్యాన్ చేయాల్సి వచ్చిందన్న ప్రశ్న అడగ్గా.. కేవలం తెలుగులో మాత్రమే జరిగిందని.. నిర్మాతలు ఒకసారి ఫిర్యాదు చేశారని.. కొన్నిసార్లు దర్శకులు ఇబ్బంది పడటంతో కూడా ఫిర్యాదు చేశారని.. మరో సారి ఆర్టిస్ట్ అసోషియేషన్ కు సంబంధించి సభ్యులు క్రమశిక్షణా చర్యల కింద కూడా ఫిర్యాదు చేశారన్నారు.

ఇందులో ఎవరినీ తప్పు పట్టలేమని.. తాను ముక్కుసూటిగా మాట్లాడతానాని అది కొంతమందికి నచ్చక ఇలా ఫిర్యాదు చేశారేమో అని అతడు అభిప్రాయపడ్డాడు. ఇలా కొన్ని కారణాల వల్ల తనను బ్యాన్ చేసిటనట్లు చెప్పారు. తర్వాత కూర్చొని మాట్లాడుకున్నామని.. మొత్తం పరిష్కారం అయిందన్నారు. దాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పి.. ముందుకు వెళ్లాలనేది లైఫ్ అన్నారు.

సుహాసిని -మణిరత్నం పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

దక్షిణాది రాష్ట్రాలలో డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి దర్శకుడు మణిరత్నం ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. మణిరత్నం సినీనటి హీరోయిన్ సుహాసిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి పెళ్లి గురించి అనేక వదంతులు వచ్చాయి. వీరిది ప్రేమ పెళ్లా? లేక పెద్దలు నిశ్చయించిన పెళ్లా? అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. నిజానికి వీరి పెళ్లి ఎలా జరిగింది వీరి పెళ్లి జరగడానికి కారణం ఎవరు అనే విషయానికి వస్తే..

1988 జూన్ నెలలో సుహాసిని తండ్రి చారుహాసన్ కి వెన్ను సమస్యలు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే సుహాసిని చూస్తూ ఆయన డిసెంబర్ లో ఏ విధమైనటువంటి సినిమాలను ఒప్పుకోకు అని చెప్పారు.తన తండ్రి అలా ఎందుకు చెప్తున్నాడు అర్థం కాని సుహాసినికి తన తండ్రి అసలు విషయం చెప్పాడు.బయట నీ గురించి దర్శకుడు మణిరత్నం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఒకసారి వెళ్లి అతనిని కలువు అంటూ సమాధానం చెప్పాడు.

తన తండ్రి అలా చెప్పగానే సుహాసిని మొహంలో ఆనందం, ఆశ్చర్యం రెండు వ్యక్తమయ్యాయి. అయితే తానెప్పుడు మణిరత్నం గారితో మాట్లాడకపోయినా అతనంటే సుహాసిని ఒక రకమైన గౌరవం ఉండేది. ఈ క్రమంలోనే అతనితో తన తండ్రి మాట్లాడమని చెప్పినప్పుడు ఎంతో ఆనంద పడింది. ఈ క్రమంలోనే అతనితో ఎలా మాట్లాడాలి అని తన స్నేహితురాలు సలహామేరకు ఫోన్ చేసి మణిరత్నం గారితో మాట్లాడింది.

ఈ విధంగా మొదటి సారి వీరిద్దరూ కలుసుకుని ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు.ఈ క్రమంలోనే మణిరత్నం మరోసారి కలుద్దాం అంటూ వెళ్ళాడు. ఆ తర్వాత మరోసారి కలుసుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ విషయాన్ని దాదాపు ఒక వారం రోజుల వరకు ఎవరికీ చెప్పకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు పెళ్లి గురించి మాటలు రావడంతో వీరి పెళ్లి నిశ్చయమైంది.

ఈ విధంగా సుహాసిని మణిరత్నం మధ్య ఏదో జరుగుతుందని బయట వచ్చిన వార్తలే వారి పెళ్లికి పునాదులు వేశాయి. ఈ విధంగా పెద్దల సమక్షంలో 1988 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. వీరికి నందన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

‘నవరస’ సిరీస్ పై వివాదం.. నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలి..

సినిమాల్లో మణిరత్నం చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఏదో తెలియని మాయ ఉంటుంది. అదే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో ఒకొక్కరిది ఒక్కో ప్రత్యేకత.. అయితే మణిరత్నం సినిమాలు మాత్రం అన్నీవర్గాల ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి.

ఈ క్రమంలోనే ఆయన ‘నవరస’ సిరీస్‌‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తొమ్మిదిమంది దర్శకులతో, తొమ్మిదిమంది హీరోలతో ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌ను నిర్మించారు. ఈ నవరస వెబ్ సిరీస్ నిన్నటి నుంచి అంటే ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది .నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్‌‌‌‌‌లో ఒక్కొక్క రసాన్ని చూపించారు.

దర్శకుడు జయేంద్రతో కలసి మణిరత్నం నవరసను నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ టీజర్, ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిచాయి. హాస్యం , శృంగారం, భయానకం , కరుణ , రౌద్రం , కోపం , ధైర్యం , అద్భుతం, బీభత్సం లాంటి మానవ జీవితంలోని నవరసాల ఎమోషన్స్‌‌‌‌తో ‘నవరస’ఆంథాలజీ సిరీస్ రూపొందిచారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ సిరీస్ లో 7 వ ఎపిసోడ్ ఇన్మై స్టోరీ పోస్టర్ ద్వారా పెద్ద వివాదం చెలరేగింది.

ఆ పోస్టర్ ను ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ను అవమానించినట్లుగా ఉందని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. దీంతో సిరీస్ ను, సిరీస్ ను విడుదల చేసిన నెట్ ఫ్లిక్స్ లను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తున్నాయి. కానీ దీనిపై డైరెక్టర్ మణిరత్నం, ఇటు నెట్ ఫ్లిక్స్ ఇంకా స్పందించలేదు.

సుకుమార్ ‘పుష్ప’ కి మణిరత్నం మూవీకి లింక్ ఏంటి.. నిజంగా పుష్ప స్టోరీ ఇదేనా..??

సుకుమార్ పుష్ప సినిమాకి మణిరత్నం సినిమాకి నిజంగా లింక్ ఉందా..?అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఎర్ర చందనం స్మగ్లర్ వీరప్పన్ లైఫ్ స్టోరీని కాస్త అందమైన, ఆకర్షణీయమైన మెలికలు తిప్పి తనదైన స్టయిల్ తో రిచ్ కాస్టింగ్ తో విలన్ మూవీ చేశారు మణిరత్నం. అప్పట్లో ఆ మల్టీస్టారర్ సోసోగానే నడిచింది. సరిగ్గా ఎక్కలేదు ఆడియెన్స్ బుర్రలోకి. ఇప్పుడు దాదాపు అదే సెంట్రల్ లైన్ ని… సరికొత్త ట్రీట్మెంట్ తో ట్రై చేస్తున్నారా?

అయినా సుక్కూ చేస్తున్న పుష్ప మూవీకీ ఆ విలన్ కీ ఏదైనా రిలేషనుందా? అసలు కథ ఏంటంటే..శేషాచలం అడవులు.. ఎర్ర చందనం స్మగ్లర్లు.. పోలీసులతో పగలు ప్రతీకారాలు.. ఇవీ ప్రస్తుతానికి పుష్ప మూవీ స్టోరీ మీదొచ్చిన బేసిక్ హింట్స్. బట్.. ఇదంతా వింటే ఎక్కడో చూసిన కథలానే లేదూ అనే డౌట్లు మొదట్లో చాలానే పుట్టేశాయ్.లేటెస్ట్ గా వినిపించే ఫీలర్లు ఆ సందేహాల్ని ఇంకాస్త డెప్త్ లోకి తీసుకెళ్తున్నాయి.

చెల్లెలి చావుకి కారణమైన పోలీసాఫీసర్ కి గుణపాఠం చెప్పాలన్నది మణిరత్నం తీసిన విలన్ మూవీకి నేపథ్యం. అందులో విక్రమ్ హీరో అయితే చెల్లి పాత్రలో ప్రియమణి నటించారు. అదే సిస్టర్ సెంటిమెంట్ ని, అదే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సుక్కూ ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేశారట. పుష్పరాజ్ చెల్లిగా ఐశ్వర్య రాజేష్ ఓకే అయినట్లు కూడా ఓ టాక్ నడుస్తోంది. పుష్పరాజ్ ని ఢీకొట్టే పవర్ ఫుల్ అండ్ నెగిటివ్ జీల్ వున్న పోలీసాఫీసర్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించబోతున్నారు.

పుష్ప గురించి వినిపిస్తున్న ఈ కొత్త కథలో నిజమెంతనేది ఆ లెక్కల మేస్టారుకే తెలియాలి. ఇప్పుడైతే.. 60 పర్సెంట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి.. రిలీజ్ డేట్ కి పక్కాగా రెడీ చేసే ఆలోచనలో వున్నారు సుక్కూ..ఇక సినిమాని ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల మరోసారి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.