Tag Archives: medicine

మెడిసిన్ నిజామా.. నకిలీనా అనేది ఇలా గుర్తించండి!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవితం పొందాలంటే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.ఈ క్రమంలోనే చాలామంది వారు ఆరోగ్యంగా ఉండటం కోసం వారి డైట్ లో ఎన్నో రకాల సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లో మనకు ఎన్నో రకాల డైట్ సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో నిజమైనవి ఏవి నకిలీవి ఏవి అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఏర్పడుతుంది. అయితే నిజమైన మందులు, నకిలీ మందులను ఎలా కనుక్కొంటారు ఇక్కడ తెలుసుకుందాం..

మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు పైన బార్ కోడ్ ఉంటుంది.అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది కనుక స్మార్ట్ ఫోన్ లో వివిధ రకాల యాప్ ఉపయోగించి బార్ కోడ్ స్కాన్ చేస్తే చాలు స్వచ్ఛమైనవో కాదో ఇట్టే తెలిసిపోతుంది. అదేవిధంగా ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు బయట ఉన్న ప్యాకేజ్ లేదా సీల్ గమనించారు అంటే అది ఒరిజినలా లేక డూప్లికేటా అనేది తెలిసిపోతుంది.

మనం మార్కెట్లో ఏదైనా ప్రొడక్ట్ కొనేటప్పుడు ముందుగా ఆ ప్రోడక్ట్ పైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అప్రూవల్ ఉందో లేదో చూడండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేకపోతే అది ఫేక్ ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనం కొన్ని ప్రాజెక్టులను వాటర్ ద్వారా చెక్ చేసి అది నిజమైనదా కాదా తెలుసుకోవచ్చు.

మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేసినప్పుడు అందులో నుంచి ఒక స్పూన్ సప్లిమెంటరీ తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలపండి. ఆ సప్లిమెంట్ మొత్తం నీటిలో కలిగితే అది ఎంతో స్వచ్ఛమైనది. అలాకాకుండా క్లాస్ అడుగుభాగాన చేరితే అది నకలీ ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకోండి.ఈ విధంగా మనం ఏదైనా మందులు కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న పద్ధతులను పాటించి మందులు మంచివా లేక నకిలీవా అనే విషయాలను తెలుసుకోవచ్చు.

కొడుకు మందుల కోసం 300 కిమీలు సైకిల్ తొక్కిన తండ్రి..?

కన్న పిల్లల కోసం తమ తల్లిదండ్రులు ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు.తమ బిడ్డల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే తమ ప్రాణాలను సైతం అడ్డువేసి తమ బిడ్డలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. అచ్చం ఇలాంటి ప్రయత్నమే కన్నపేగు చేసింది. తన కొడుకు అనారోగ్యంతో బాధ పడుతున్న క్రమంలోతన కొడుకు మందుల కోసం ఏకంగా 300 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణం చేసి మందులు తీసుకు వచ్చిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే….

బన్నూరు సమపీంలోని గనిగానకొప్పల్ గ్రామంలో నివసిస్తున్న ఓ వ్యక్తి నిర్మాణ సంస్థలో కూలి పనులు చేసుకుంటున్న తన కుమారుడు ఆరోగ్యం చూసుకునేవాడు. ఈ క్రమంలోనే అతడికి తన గ్రామం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) వైద్యులు గత పదేళ్లుగా అతడి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి తన కొడుకుకు మందులు తీసుకువచ్చే వాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తడంతో మందులు తీసుకురావడానికి ఎంతో ఇబ్బంది కలిగింది.ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో తన కొడుకు మందులు వాడకపోతే ఎంతో ప్రమాదం కలుగుతుందని వైద్యులు సూచించడంతో ఎలాగైనా తన కొడుకు ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఆ తండ్రి ఏకంగా సైకిల్ పై తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే మే 23న సైకిల్ పై గనిగానకొప్పల్ గ్రామం నుంచి బయలుదేరిన ఆ వ్యక్తి మే 26న తిరిగి గ్రామానికి చేరుకున్నారు.సుమారు రానుపోను మూడు వందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి తన కొడుకు కావలసిన మందులను తీసుకువచ్చాడు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తి మాట్లాడుతూ…18 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు తన కొడుకుకు మందులు ఇవ్వాలని..మందులు ఆపేస్తే తన కొడుకు మూర్ఛ వ్యాధితో మరణించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో ఈ విధంగా సైకిల్ మీదే అక్కడికి చేరుకొని తన కొడుకు కావలసిన మందులను తీసుకొచ్చానని, ఈ విషయం తెలిసిన ఆస్పత్రి యాజమాన్యం తనకు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపినట్లు ఆ తండ్రి తెలిపారు.

పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

వెల్లుల్లి మన వంటింట్లో దొరికే ఒక ఔషధం అని చెప్పవచ్చు. వెల్లుల్లిని ప్రతిరోజు వంటలలో రుచి కోసం ఉపయోగిస్తుంటారు.అయితే కూరలలో వెల్లుల్లి కనిపిస్తే చాలామంది దాన్ని తీసి పక్కన పెడుతుంటారు.ప్రతి రోజు వెల్లుల్లిని మన ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా ఉదయం పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ వెల్లుల్లిని వదలకుండా తింటారు. అయితే పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

మన శరీరం తరచూ ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి విముక్తి కలగాలంటే ప్రతిరోజు పరగడుపున వెల్లుల్లి తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.ప్రతి రోజు ఉదయం లేవగానే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అదేవిధంగా మన జీర్ణాశయంలోకి ప్రవేశించిన హానికర బ్యాక్టీరియాలను బయటకు పంపటంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది.

జ్వరం ,ఉబ్బసం, కాలేయ సంబంధిత వ్యాధులకు, చాతి సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి పొందటానికి వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు వెల్లుల్లిని తీసుకోవటంవల్ల రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మన శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పైబడిన వారు ఎక్కువగా కీళ్లనొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతుంటారు.అలాంటి వారు వెల్లుల్లి రసంతో నొప్పి ఉన్న చోట మర్దన చేయడం ద్వారా ఆ నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం తేనెతో కలిపిన వెల్లుల్లి రసాన్ని తీసుకోవడం ద్వారా మన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ విధంగా వెల్లుల్లిని పరగడుపున తీసుకోవడం ద్వారా ఇన్ని ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

తక్కువ జీతం వచ్చే వాళ్లకు శుభవార్త.. ఫ్రీగా విద్య, వైద్యం, పెళ్లికి డబ్బులు..!

మనలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే మెజారిటీ ఉద్యోగుల వేతనం 25,000 రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. తక్కువ మొత్తం వేతనం రూపంలో లభిస్తూ ఉండటం వల్ల విద్య, వైద్యం, పెళ్లి లాంటి వాటి కోసం ఖర్చు చేయాల్సి వస్తే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గాయి.

మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటే మాత్రమే ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించటానికి కంపెనీలు సిద్ధపడే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ మొత్తం వేతనం లభిస్తోందని ఏ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ మొత్తంలో వేతనం పొందుతున్న వారి కోసం ప్రత్యేక స్కీమ్స్ ను అందుబాటులోకి తెచ్చి ఆ స్కీమ్స్ ద్వారా వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ఫ్రీగానే కొన్ని రకాల సౌకర్యాలు పొందే అవకాశం కల్పిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇఅలాంటి స్కీమ్స్ అందుబాటులో లేవు కాని హరియాణ ప్రభుత్వం మాత్రం నెలకు కేవలం 25 రూపాయలు చెల్లించి విద్య, వైద్యం, పెళ్లి కోసం ప్రభుత్వం నుంచి సాయం పొందవచ్చు. నెలకు మొత్తం 75 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఉద్యోగి 25 రూపాయలు చెల్లిస్తే మిగిలిన 50 రూపాయలు ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెల చెల్లించిన యువతులు పెళ్లి చేసుకుంటే వారికి ప్రభుత్వం 51,000 రూపాయలు అందిస్తుంది.

మహిళలు చెల్లిస్తే వాళ్ల ఆడపిల్లలకు ప్రభుత్వం నుంచి 51,000 రూపాయల ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం పెళ్లికి మూడు రోజుల మందు ఈ నగదు లబ్ధిదారులకు అందేలా చేస్తుంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్, బుక్స్ కోసం ప్రతి సంవత్సరం 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. పని చేసే సమయంలో వైకల్యం సంభవిస్తే లక్షన్నర రూపాయలు, మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కుటుంబానికి అందుతుంది.