Tag Archives: mushrooms

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Health Tips: సాధారణంగా నాన్ వెజ్ ఇష్టపడనివారు మష్రూమ్స్ తినటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మష్రూమ్స్ లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగివున్నాయి. మష్రూమ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రోగాల బారి నుండి మనల్ని కాపాడతాయి. ప్రస్తుత కాలంలో మష్రూమ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన ఆహార పదార్థాలు అయినా మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా అమితంగా తీసుకోవటంవల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

మష్రూమ్స్ బాగా ఇష్టపడే వారు ఎక్కువ మోతాదులో వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల పుట్టగొడుగులు లభిస్తున్నాయి. వాటిలో చాలా రకాల పుట్టగొడుగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అటువంటి వాటిని తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారికి మష్రూమ్స్ ఎక్కువగా తినటం వల్ల అజీర్తి కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడే వారు మష్రూమ్ తక్కువగా తీసుకోవటం శ్రేయస్కరం.
చాలామంది అలర్జీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మష్రూమ్ ఎక్కువగా తినటం వల్ల చర్మం పై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొంతమందికి మష్రూమ్ తిన్న తర్వాత నీరసంగా అనిపిస్తుంది. అటువంటి వారు మష్రూమ్స్ తీసుకోకపోవడమే మంచిది.

గర్భవతులు దూరంగా ఉండటం మంచిది….


ముఖ్యంగా గర్భవతిగా ఉన్న వారు మష్రూమ్స్ తినకపోవడం శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో మష్రూమ్స్ ని కూడా నాచురల్ పద్ధతిలో కాకుండా అనేక రకాల రసాయనాలను ఉపయోగించి పండిస్తున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో మష్రూమ్ ఎక్కువగా తినటం వల్ల అవి తల్లి బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి.

పుట్టగొడుగులతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు చెక్ పెట్టేయొచ్చు..

ఈ టెక్నాలజీ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. చాలా మంది తమ ఆరోగ్యం పై అధిక మొత్తంలో శ్రద్ధ చూపడం లేదు. సమయానికి అన్నం తినకపోవడం.. వేళకు నిద్ర పోవడం లేదు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవాల్సి వస్తుంది.

దీంతో దొరికిందల్లా పక్కన పెట్టుకొని మరీ లాగేస్తున్నాడు. దీంతో ఉబకాయరాయుళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే చాలామంది తమ శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అయితే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను, విటమిన్లను అందించే వాటిలో పుట్టగొడుగులు ప్రత్యేకంగా ఉంటాయి.

పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు అనేవి శిలీంద్రాలు. ఈ పుట్టగొడుగులను మనం సాధారణంగా కుళ్లిన పదర్ధాలు ఉన్న చోట చోడొచ్చు. అక్కడే ఎక్కువగా పెరుగుతాయి. అయితే కుళ్లిన పదర్థాలపై పెరుగుతున్న ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా.. అనే సందేహం కూడా చాలమందికి వచ్చే ఉంటుంది. కానీ ఇవి తినడం వల్ల ఎలాంటి రోగాలు రావని వైద్యనిపుణులు కూడా స్పష్టం చేశారు.

అనేక సంవత్సరాలు ఈ వైవిధ్యమైన ఆహారం పై ఎన్నో వైద్య పరిశోధనలు జరిగాయి. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం, ముఖ్యంగా మాంసకృతులు అధికంగా ఉండటం వలన పోషకాహారలోపంతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్న ఆహారంగా సూచిస్తున్నారు. ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్‌కు చక్కగా పనిచేస్తుంది.