Tag Archives: nadu nedu

ఎమ్మేల్యే రోజాపై విమర్శల వర్షం.. మంచి పనికి వెళ్లినా తప్పని తిప్పలు.. ఏమైందంటే..!

ఆర్కే రోజా అంటే.. నగిరి ఎమ్మెల్యేగా కంటే కూడా చాలామందికి హీరోయిన్ గా.. బబర్దస్త్ జడ్డిగా చాలామందికి సుపరిచితం. ఆమెను వైయస్సార్సీపి పార్టీ ఫైర్ బ్రండ్ గా కూడా పిలుస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. దానికి భారత రాష్ట్రపతి కూడా అతీతం కాదు. మూతికి మాస్స్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలి.

కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటూ వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అయితే దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసకుంటున్నారు. కానీ ఇంకా 18 ఏళ్ల లోపు పిల్లలకు మొదలవ్వలేదు. పాఠశాలలో ఉండే పిల్లల దగ్గర ఎవరైనా నిబంధనలకు లోబడి బోధన లేదా ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే రోజా దానికి విరుద్ధంగా ప్రవర్తించారు.

చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అత్తూరులో 27.83 లక్షల రూపాయల వ్యయంతో ‘నాడు నేడు’ పథకం కింద ఆధునికరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనమును ఆమె ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు ఉన్న తరగతి గదికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. అక్కడ టీచర్ అవతారం ఎత్తారు. కాసేపు వాళ్లకు బోధించారు కూడా. అయితే ఈ సమయంలోనే ఆమె ఫేస్ కు మాస్క్ ధరింలేదు. అంతేకాకుండా.. ఆమె పక్కన ఉన్నవారు కూడా ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు.

భౌతికదూరం అస్సలు లేనే లేదు. దీంతో ఆమెపై ప్రతిపక్షపార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా తీసుకోని పిల్లల వద్ద మాస్క్ లు లేకుండా ఎలా తిరుగుతారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నాయకులు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మినహాయిపు ఇచ్చారా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోవిడ్ ప్రమాణాలు పాటించని ఆ పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్ ఇచ్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లు టీచర్లకు వృత్తికి సంబంధం లేని పనులు చెప్పవద్దని, ప్రైవేట్ స్కూళ్లు టీచర్లను అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు పంపించవద్దని సూచించింది.

జగన్ సర్కార్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు టార్గెట్ విధించి మరీ టీచర్లు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను స్కూళ్లలో చేర్పించాలని చెబుతూ ఉంటాయి. టీచర్లు అలా చేయకపోతే వేతనాల్లో కోత విధించడం లేదా వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించడం చేస్తూ ఉంటాయి. కొందరు టీచర్లు ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో విద్యాశాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రభుత్వ ఆదేశాల వల్ల ఇకపై పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులను చెప్పకూడదు. ఉపాధాయులను బలవంతంగా విద్యార్థుల ఇళ్లకు పంపినా లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చాలంటూ వచ్చినా అలాంటి పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. మరోవైపు జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోనుంది.

జగన్ సర్కార్ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. నాడు- నేడు ద్వారా జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు అడుగులు వేస్తోంది. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కీమ్ ల ద్వారా జగన్ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

ఆరోగ్య శ్రీ విషయం మరో శుభవార్త చెప్పిన జగన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ విషయంలో రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే నెల 13వ తేదీ నుంచి 2,000 వ్యాధులకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని భవిష్యత్తులో మరిన్ని వ్యాధులను జాబితాలో చేర్చే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్య శాఖలో నాడు నేడు పనుల గురించి సమీక్ష నిర్వహించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరాలకు అనుగుణంగా వైద్య ప్రక్రియలను చేపడతామని వెల్లడించారు.

అధికారులను నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ, పనులకు సంబంధించిన పూర్తి వివరాల గురించి జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు సీఎం జగన్ కు నాడు నేడు కింద చేపట్టే పనుల కోసం 17,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని… వైద్య కళాశాలల్లో చేపట్టే పనులకు 5,472 కోట్ల రూపాయలు అదనంగా అవసరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయాలను హెల్త్‌ క్లినిక్‌లు‌ అందుబాటులోకి వచ్చేంత వరకు ఆరోగ్య శ్రీ రెఫరల్ పాయింట్లుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా ప్రజలకు అందుబాటులోకి రాబోతున్న వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ లు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణాల గురించి అధికారులతో చర్చించారు. మచిలీపట్నం, పులివెందుల, పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల నిర్మాణాలకు వచ్చే నెలలోగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.

నంద్యాల, మార్కాపురం, బాపట్ల, అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం కాలేజీలకు టెండర్లు పిలవాలని చెప్పారు. రాజమహేంద్రవరం, పెనుకొండ, అమలాపురం, ఆదోని, విజయనగరంలలో జనవరిలో టెండర్లు పిలవాలని తెలిపారు.