Tag Archives: Nandamuri fans

Mokshagna: నందమూరి అభిమానులకు శుభవార్త..ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న బాలయ్య వారసుడు..?

Mokshagna: నందమూరి కుటుంబం నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలయ్య తనయుడు ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదని వార్తలు రావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ తర్వాత అవి రూమర్స్ మాత్రమే అని క్లారిటీ వచ్చింది.

ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ శుభ తరుణం రానే వచ్చింది. త్వరలోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా కూడా ఈ వార్తలలో నిజం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.

సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞను ఇండస్ట్రీలో లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేని సినిమాతో బిజీగా ఉన్నారు.
ఆ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్యతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలోని తండ్రి కొడుకులిద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నట్లు సమాచారం.

Mokshagna: బాలయ్య సినిమాలో మోక్షజ్ఞ…

సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో మోక్షజ్ఞ కనిపిస్తారట. ఆ సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్‌లో కనిపించినప్పటికీ.. అది సినిమాకే హైలైట్​గా నిలవనుందట. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వార్తలు వినిపించడంతో నందమూరి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞని హీరోగా వెండితెరపై చూస్తామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పైగా ఒకే స్క్రీన్ మీద బాలయ్య, మోక్షజ్ఞని కలిసి చూసే తరుణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Jr.NTR: నీ కన్నా షర్మిలానే బెటర్.. ఎన్టీఆర్ ట్వీట్ పై ఫైర్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్?

Jr.NTR: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరును మార్చాలంటూ నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చారు.

ఈ విధంగా ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంతో తెలుగుదేశం అభిమానులు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఇద్దరు గొప్ప నాయకులే ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయన స్థాయి తగ్గదు. తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపి వేయలేవు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైయస్సార్ ఎన్టీఆర్ ఇద్దరు గొప్ప నాయకులే అంటూ స్వీట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ను వైయస్సార్ తో పోల్చడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాయి ఏంటి వైయస్సార్ స్థాయి ఏంటి?ఇద్దరినీ గొప్పవాళ్ళను పోల్చడంపై నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్నారు.

Jr.NTR: భారీ ట్రోలింగ్ కు గురైన ఎన్టీఆర్…

ఇలా తాత పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం విషయంపై ప్రశ్నించకుండా ఇద్దరు గొప్ప నాయకులే అంటూ ప్రశ్నించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే మరి కొంతమంది నీకన్నా వైయస్ షర్మిలానే బెటర్ ఆమె ఎన్టీఆర్ పేరును తొలగించడం పూర్తిగా తప్పు అంటూ ఎంతో ధైర్యంగా తన అన్నయ్యను నిలదీసింది.మొత్తానికి ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ కారణంగా పెద్ద ఎత్తున నేటిజెన్లు అభిమానుల ట్రోలింగ్ కి గురయ్యారు.