Tag Archives: neeraj chopra

అమాంతం పెరిగిన గోల్డెన్ బాయ్ బ్రాండ్.. నీరజ్ చోప్రా కోసం క్యూ కట్టిన సంస్థలు..

నీరజ్‌ చోప్రా టోక్యో ఒలంపిక్స్ కంటే ముందు చాలామందికి తెలియని పేరు. ఇప్పుడు ఆ పేరు దేశంలో అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. దేశానికి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు ఇతడు. అందుకే అతడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. ఏం చేసినా.. అతడు ఎక్కడికి వెళ్లినా తెగ ఫాలో అవుతున్నారు చాలామంది. ప్రస్తుతం అత్యంత ప్రజాధారణ ఉన్న వ్యక్తి అని చెప్పాలి. చాలా మంది అతడిని ఇప్పటికీ గోల్డెన్ బాయ్ అని పిలుస్తున్నారట.

దీంతో అతడి బ్రాండ్ విలువ ప్రస్తుతం 1000 శాతం పెరిగింది. అంటే అతడు ప్రచారకర్తకు అంతక ముందు తీసుకునే విలువలో ఎక్కువ శాతం పెరిగిందన్న మాట.సోషల్‌ మీడియాలో నీరజ్‌ ఫాలోయింగ్‌పై ‘యూగోవ్‌ స్పోర్ట్స్‌’ అనే రీసెర్చ్‌ సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. సోషల్‌ , డిజిటల్‌ మీడియాలో అతడి రీచ్‌ ఏకంగా 41.2 కోట్లకు చేరింది. ఈ అంకెలు మొత్తం నీరజ్‌ చోప్రా సోషల్‌ మీడియా విలువను రూ.428 కోట్లకు చేర్చినట్లు ఆ సంస్థ తేల్చింది. అతడి విలువ మరింత పెరగడానికి గల కారణం మరోటి ఉంది.

అదేంటంటే.. బంగారు పతకం గెలిచిన తర్వాత అతడి అభిమానులు పాక్‌ క్రీడాకారుడు అర్షాద్‌ నదీమ్‌పై విమర్శలు కురిపించారు. దీనికి నీరజ్‌ పరిణతి, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు. దీంతో భారతీయుల్లో ఈ కుర్రాడిపై మరింత అభిమానం పెరిగింది. అతడు బంగారు పతకం గెలవకముందు కూడా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.

అప్పట్లో తక్కువ తీసుకున్న ఈ బంగారు వీరుడు.. ప్రస్తుతం వాటి విలువలో మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా అతడు సమాజానికి ఉపయోగపడే వాటికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తానని కూడా తెలిపాడు. పొగాకు, మద్యం ప్రకటలకు దూరంగా ఉంటానన్నాడు. అతడి కోసం దాదాపు 80 సంస్థలు క్యూ కట్టాయి.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!

ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరికొద్ది గంటల్లో ఎర్రకోట నుండి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జాతినుద్దేశించి ప్రసంగించిన ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా ఏడో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం విశేషం.

కాగా స్వతంత్ర భారతంలో మొదటిసారిగా జాతీయ పతాకం ఆవిష్కరించిన వెంటనే.. వింగ్ కమాండర్ బల్దేవ్ సింగ్ నేతృత్వంలోని వైమానిక దళం రెండు విమానాల ద్వారా పూల వర్షం కురిపించనుంది.

ఇక టోక్యో ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తో పాటు 32 మంది ఒలంపిక్ విజేతలు మొదటిసారిగా ఎర్రకోట వేడుకలో పాల్గొనున్నారు.

మీ సైన్యంలో మేమంతా భాగమే.. బాహుబలి.. వైరల్ గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్..

భారతదేశం తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడికి బహుమతులు, విరాళాలు కొకొల్లలుగా వచ్చి పడుతున్నాయి. జావెలిన్‌ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆ క్షణం నుంచి అతడిని భారత హీరోగా ప్రతీ ఒక్కరు అభివర్ణిస్తున్నారు. అతడు స్వర్ణం గెలిచిన వెంటనే బీసీసీఐ రూ.కోటి నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నీరజ్ చోప్రాను బాహుబలి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. స్వర్ణం గెలవడంతో భారతదేశంలోని ప్రతీ పౌరుడి గుండెల్లో నిలిచిపోయావని ఆయన ప్రశంసించారు. అయితే ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు.

తేష్‌ జైన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ నీరజ్‌ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. ఆ భ్యర్థనను అంగీకరించిన ఆనంద్ మహీంద్రా తప్పకుండా తాను దీనిని అంగీకరిస్తున్నానని అతడికి ఎక్స్‌యూవీని ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. ఎక్స్‌యూవీ బహుమతిగా ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం మాత్రమే కాకుండా.. ఎంతో గౌరవం అంటూ రిప్లై ఇచ్చారు.

అంతేకాకుండా తామంతా మీ ఆర్మీలో భాగమే.. బాహుబలి అంటూ నీరజ్‌ చోప్రాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్ కు తోడు నీరజ్ జావెలిన్ ని విసిరే ఫోటోతో పాటు బాహుబలి చిత్రంలోని యుద్ద సమయంలో ప్రభాస్ ఉన్న ఫొటోని షేర్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ మరియు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.