నీరజ్ చోప్రా టోక్యో ఒలంపిక్స్ కంటే ముందు చాలామందికి తెలియని పేరు. ఇప్పుడు ఆ పేరు దేశంలో అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. దేశానికి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు ఇతడు. అందుకే అతడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. ఏం చేసినా.. అతడు ఎక్కడికి వెళ్లినా తెగ ఫాలో అవుతున్నారు చాలామంది. ప్రస్తుతం అత్యంత ప్రజాధారణ ఉన్న వ్యక్తి అని చెప్పాలి. చాలా మంది అతడిని ఇప్పటికీ గోల్డెన్ బాయ్ అని పిలుస్తున్నారట.
దీంతో అతడి బ్రాండ్ విలువ ప్రస్తుతం 1000 శాతం పెరిగింది. అంటే అతడు ప్రచారకర్తకు అంతక ముందు తీసుకునే విలువలో ఎక్కువ శాతం పెరిగిందన్న మాట.సోషల్ మీడియాలో నీరజ్ ఫాలోయింగ్‌పై ‘యూగోవ్ స్పోర్ట్స్’ అనే రీసెర్చ్ సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. సోషల్ , డిజిటల్ మీడియాలో అతడి రీచ్ ఏకంగా 41.2 కోట్లకు చేరింది. ఈ అంకెలు మొత్తం నీరజ్ చోప్రా సోషల్ మీడియా విలువను రూ.428 కోట్లకు చేర్చినట్లు ఆ సంస్థ తేల్చింది. అతడి విలువ మరింత పెరగడానికి గల కారణం మరోటి ఉంది.
అదేంటంటే.. బంగారు పతకం గెలిచిన తర్వాత అతడి అభిమానులు పాక్ క్రీడాకారుడు అర్షాద్ నదీమ్‌పై విమర్శలు కురిపించారు. దీనికి నీరజ్ పరిణతి, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు. దీంతో భారతీయుల్లో ఈ కుర్రాడిపై మరింత అభిమానం పెరిగింది. అతడు బంగారు పతకం గెలవకముందు కూడా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.
అప్పట్లో తక్కువ తీసుకున్న ఈ బంగారు వీరుడు.. ప్రస్తుతం వాటి విలువలో మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా అతడు సమాజానికి ఉపయోగపడే వాటికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తానని కూడా తెలిపాడు. పొగాకు, మద్యం ప్రకటలకు దూరంగా ఉంటానన్నాడు. అతడి కోసం దాదాపు 80 సంస్థలు క్యూ కట్టాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…