General News

ఏపీ సెక్రటేరియట్ లో భారీ స్కామ్.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీఫ్ ఫండ్) అనేది పేదలకు ఎంతో కొంత భరోసాను కల్పిస్తుంది. ఆర్థికంగా కొంత ఆసరాగా నిలుస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో జాయిన్ తర్వాత.. అక్కడ అయిన ఖర్చులో కొంత మేర సీఎంఆర్ఎఫ్ నుంచి డబ్బులను ప్రభుత్వం అందజేస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధుల గోల్ మాల్ భారీగా జరిగినట్లుగా ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. పేదలు, లబ్ధి దారుల నుంచి డేటా తీసుకుని.. వారి పేరుతో CM రిలీఫ్‌ ఫండ్ నిధులను స్వాహా చేశారు కొందరు కేటుగాళ్లు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 50 మంది కుమ్మక్కయి గూడుపుఠాణీ నడిపిట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.అందులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ ప్రకటించింది. 2014 నుండి సీఎంఆర్ఎఫ్ స్కాం విచారణను చేపడుతున్నట్లు ఏసీబీ తెలిసింది.

అరెస్టైన నలుగురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులున్నారని ఏసీబీ ప్రకటించింది. 2014 నుంచి కూడా దీనిలో అక్రమాలు జరుగుతున్నట్లు సమచారం రావడంతో.. వాటిపై ఏపీ సీఎం విచారణ చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీఆర్‌పీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకొందని అనుమానించిన ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఆరు మాసాలుగా విచారణ చేస్తున్నారు.

దొరికిన వారిలో ఏ వన్ గా చలువాడి సుబ్రమణ్యం ఉండగా.. ఏ టూ గా సోక రమేష్ ఉన్నారు. ఏ త్రీగా చదలవాడ మురళీకృష్ణ ఉండగా.. చివరిగా ఏ ఫోర్ గా కొండెపూడి జగదీష్ ధన్‌రాజ్ ఉన్నారు. వీరి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీటిలో ఎంత అమౌంట్ స్కాం జరిగిందనే విషయాలను ఏసీబీ వెల్లడించలేదు. వీరి నలుగురితో పాటు దీనిలో ఎవరికైనా భాగస్వామ్యం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago