అక్కడ ఒక రహదారిపై జనం గుమిగూడి ఉన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగిందనో లేదా ఎవరైనా కొట్టుకుంటారనో అనుకుంటాం. కానీ దగ్గరకు వెళ్లి చూసే సరికి తెలిసింది. అక్కడ కండోమ్ లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయని.. వాటిని చూసేందుకు వాళ్లు గూమిగూడారని. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఈ ఘటన జరిగి 10 రోజులు అవుతుంది. ఆ సమయంలో దీనిపై స్థానికులు, పాదచారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు చివరకు ఈ కేసును ఛేదించారు. పోలీసుల విచారణలో తేలిందేంటంటే.. కర్ణాటకలోని తుమకూరు సమీపంలో48వ జాతీయ రహదారి వద్ద సంచలనం సృష్టించిన కండోమ్‌ల కేసుకు సంబంధించి.. దర్యాప్తులో భాగంగా స్థానికంగా ఉండే నంది డీలక్స్ లాడ్జిలో సోదాలు నిర్వహించారు.
తర్వాత వీళ్లకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పైకి నీట్‌గా కనిపిస్తున్న ఈలాడ్జీలో సొరంగంలో వ్యభిచారం బాగోతం బయటపడింది. దీన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఈ సొరంగాన్ని వ్యభిచార కూపంగా వాడుకుంటున్నట్లు తెలిపారు. కండోమ్‌లు ఇక్కడి నుంచి వచ్చినవిగా భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఆ సొరంగంలో ముగ్గురు దాగి ఉన్నారు.
వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు.. ఒక వ్యక్తి ఉన్నారు. ఈ లాడ్జిలో సెక్స్ రాకెట్ నడపుతున్నట్లు తేలిందని.. తాత్కాలికంగా ఈ లాడ్జీని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఇద్దరిని ఒడనాడి సేవా ట్రస్ట్ సహకారంతో అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…