కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీలో తనకంటూ ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అటు సినిమాల్లో నటిస్తూ .. ఇటు బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న ‘అలీతో సరదాగా ప్రోగ్రాం’ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. దీనిలో పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూలకు పిలిచి తన కామెడీతో వ్యక్తిగత విషయాలను రాబడతుంటాడు.
ఇలా వాళ్లతో సరదాగా సంభాషిస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. ఇలా వారానికి ఒక రోజు ఒక సెలబ్రిటీతో సరదాగా కాసేపు అన్నట్లు వ్యవహరిస్తాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల అతడి ప్రోగ్రాంకు సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయింది. అందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించారు. అలీతో మోహన్ బాబు జీవితంలో ఎదురైన కష్టాలను వివరిస్తూ తను పడ్డ ఇబ్బందులను వివరిస్తాడు. తన తల్లికి వినికిడి లోపం ఉందని.. తాము నలుగురం అన్నదమ్ముళ్లం అని.. తమను పోషించడానికి ఎన్నో కష్టాలు పడ్డారని మోహన్ బాబు చెప్పుకొస్తాడు.
సినిమాలోకి రావాలని ఉన్న సమయంలో ఎంతో మంది హేలన చేశారని కూడా అతడు చెప్పాడు. తాను కనపడే అంత హార్డ్ పర్సన్ కాదని.. చాలా సెన్సెటివ్ మైండ్ ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా తన తదుపరి చిత్రానికి సంబంధించి సినిమాలో ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను ప్రేక్షకుల కోసం చెప్పాడు.
అదేంటంటే ‘‘లారీ క్లీనర్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే 24 గంటల్లో ఎన్కౌంటర్ చేస్తారు.. మనం శభాష్ అని చప్పట్లు కొడతాం.. అదే బడా బాబులు వాళ్లకి పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు.. దట్ ఈజ్ అవర్ ఇండియా’’ అంటూ ఇటీవల జరుగుతున్న అత్యాచారాలకు రిలేటివ్ గా ఉన్న ఆ డైలాగ్ ను చెబుతాడు. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారగా.. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…