General News

బ్రిడ్జిపై డ్యాన్స్ వేసిన కమెడియన్.. షాక్ ఇచ్చిన పోలీసులు..

విచ్చలవిడిగా విస్తరిస్తున్న సోషల్ మీడియా మాధ్యమం యువతను.. ఆ మాటకొస్తే పిల్లల్ని సైతం పక్కదారి పట్టిస్తోంది. ఇంకా చెప్పాలంటే చెడు మార్గానికి తోసేస్తున్నది. ఇలా పట్టపగ్గాల్లేకుండా పోయిన సామాజిక మాధ్యమాలను ప్రతీ ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. అందులో అందరికీ ఉపయోగపడే కంటెంట్ పెడుతున్నారు.. మరికొందరు చెడుకు ఉపయోగపడేవి కూడా పోస్టు చేస్తున్నారు.

అందులో మనం దేనిని స్వీకరిస్తామనేది ముఖ్యం. అయితే సోషల్ మీడియలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటితో అందులో ఉన్న వ్యక్తి కూడా సెలబ్రిటీ హోదా కొట్టెస్తాడు. ఒక్క నైట్ కే స్టార్లు కూడా అయిన వారు ఉన్నారు. అయితే ఓ వీడియోలో .. బెంగాల్ కు సంబంధించిన కమెడియన్‌, సోషల్‌ వర్కర్‌ అయిన శాండీ సాహా కోల్ కత్తాలో భారీగా ట్రాఫిక్ ఉంటే ఓ బ్రిడ్జిపై అతడు తన కారును ఆపి.. దానిలో నుంచి దిగి డ్యాన్స్ వేశాడు.

దీంతో అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. “మై ఆయీ హు యూపీ, బిహార్‌ లూట్నే” అనే ప్రముఖ బాలీవుడ్‌ పాట పాడి.. డ్యాన్స్ వేశాడు. దీనిని రికార్డు చేసి అతడే తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్స్ వేయడానికి మీకు ఆ ఫ్లై ఓవర్ మాత్రమే దొరికిందా.. మీ వల్ల ఇతరులు చాలా ఇబ్బందులకు గురయ్యారని.. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

స్పందించిన పోలీసులు అతడికి జరిమానా విధించారు. దీనిపై వివరణ అడగ్గా సాహా ఇలా చెప్పాడు. తాను ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించలేదని.. కానీ కారును నిలపడం అనేది నిషేదమన్న విషయం తనకు తెలియదని ఒప్పుకున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago