విచ్చలవిడిగా విస్తరిస్తున్న సోషల్ మీడియా మాధ్యమం యువతను.. ఆ మాటకొస్తే పిల్లల్ని సైతం పక్కదారి పట్టిస్తోంది. ఇంకా చెప్పాలంటే చెడు మార్గానికి తోసేస్తున్నది. ఇలా పట్టపగ్గాల్లేకుండా పోయిన సామాజిక మాధ్యమాలను ప్రతీ ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. అందులో అందరికీ ఉపయోగపడే కంటెంట్ పెడుతున్నారు.. మరికొందరు చెడుకు ఉపయోగపడేవి కూడా పోస్టు చేస్తున్నారు.

అందులో మనం దేనిని స్వీకరిస్తామనేది ముఖ్యం. అయితే సోషల్ మీడియలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటితో అందులో ఉన్న వ్యక్తి కూడా సెలబ్రిటీ హోదా కొట్టెస్తాడు. ఒక్క నైట్ కే స్టార్లు కూడా అయిన వారు ఉన్నారు. అయితే ఓ వీడియోలో .. బెంగాల్ కు సంబంధించిన కమెడియన్, సోషల్ వర్కర్ అయిన శాండీ సాహా కోల్ కత్తాలో భారీగా ట్రాఫిక్ ఉంటే ఓ బ్రిడ్జిపై అతడు తన కారును ఆపి.. దానిలో నుంచి దిగి డ్యాన్స్ వేశాడు.
దీంతో అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. “మై ఆయీ హు యూపీ, బిహార్ లూట్నే” అనే ప్రముఖ బాలీవుడ్ పాట పాడి.. డ్యాన్స్ వేశాడు. దీనిని రికార్డు చేసి అతడే తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్స్ వేయడానికి మీకు ఆ ఫ్లై ఓవర్ మాత్రమే దొరికిందా.. మీ వల్ల ఇతరులు చాలా ఇబ్బందులకు గురయ్యారని.. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
స్పందించిన పోలీసులు అతడికి జరిమానా విధించారు. దీనిపై వివరణ అడగ్గా సాహా ఇలా చెప్పాడు. తాను ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించలేదని.. కానీ కారును నిలపడం అనేది నిషేదమన్న విషయం తనకు తెలియదని ఒప్పుకున్నాడు.
































