Categories: FeaturedMovie News

వందల సినిమాలలో నటించిన కల్పనా రాయ్ లాంటి వారు అంత్యక్రియలకి కూడా డబ్బులేని ధీన స్థితిలో లోకాన్ని వీడి వెళుతున్నారు.. దానికి కారణాలు ఇవేనా పాపం!


సినిమా ఇండస్ట్రీలో సుధీర్గ ప్రయాణం కొనసాగి దాదాపు 350 నుంచి 400 సినిమాలలో నటించిన నటీ నటులు ఎందరో చివరి చూపుకు నోచుకోకుండా, ఆఖరికి అంత్యక్రియలకి కూడా డబ్బు లేని ధీన స్థితిలో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వయసున్నా, ముసలితనం వచ్చినా కొందరు సినీ తారలకి డబ్బు, హోదా ఉంటే ఎవరైనా పలకరిస్తారు.. చుట్టపు చూపుకి నోచుకుంటారు. లేదంటే ఈగలను తోలుకుంటూ బ్రతకాల్సిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనే ఈ రంగుల ప్రపంచంలో ఏదీ ఇక్కడ శాశ్వతం కాదు. ఈ విషయం ఇప్పటికే ఎంతోమంది స్వయానుభవాలను చెప్పిన సందర్భాలున్నాయి.

వచ్చేటప్పుడు ఎలా వస్తామో పోయేటప్పుడు అలానే పోతాము. ఇదే నిజం. మధ్యలో బ్రతికేదంతా మన ఊపిరి తీసుకొని వదిలేటువంటి జీవితమే. ఊపిరి తీసుకున్న వారు మళ్ళీ వదిలేలోపే అనంతలోకాలకి వెళ్ళినవారున్నారు. అలా వదిలిన ఊపిరి తీసుకునే లోపూ కళ్ళు మూస్తున్న వారూ ఉన్నారు. కానీ ఈ సత్యం అందరికీ తెలియడం లేదు. అందుకే ఈర్ష్యా భావాలతో బ్రతికేస్తున్నారు. సినిమా వాళ్ల జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని అందరూ అనుకుంటుంటారు. కానీ మావి కూలి బ్రతుకులే అని కొందరు
చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేం ఫేం ఉన్నంతవరకే సెలబ్రిటీ.

అవి పోయాయంటే అందరూ దూరమవుతారు. మంచి మంచి సినిమాలు చేస్తూ బాగా సంపాదించిన వారు ఇతరులకి దానం చేయడం వల్ల తమ వద్ద ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి ఒకరి చేయూత కోసం ఎదురు చూస్తూ ఎవరైనా వచ్చి ఆదుకుంటే బావుంటుందని ఎదురు చూస్తున్న వారు ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అలాంటి వారిలో దివంగతనటి కల్పనా రాయ్ కూడా ఉన్నారు. ‘ఓ సీత కథ’ చిత్రంతో తెలుగు చిత్రరంగంలో అడుగు పెట్టిన ఆమె దాదాపు 450 చిత్రాలలో హాస్య ప్రధానమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

400 పై చిలుకు చిత్రాలంటే సాధారణంగా ఏ నటి, నటులకైనా ఆస్తులు బాగానే ఉండి ఉంటాయని అనుకోవడం సహజం. కానీ అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొక వైపు చూస్తే పేరుకే 400 చిత్రాలలో నటించినా అందులో ఎన్ని చిత్రాలకి సరైన రెమ్యునరేషన్ అందుకొని ఉంటారు..అంత మంది సినిమాలలో పాత్రలు పూర్తయ్యాక ఎగ్గొట్టిన వారుంటారు.. ఆలోచిస్తే కల్పనా రాయ్ లాంటి వారు చివరి దశలో ఆర్ధిక కష్టాలను ఎందుకు అనుభవించారో అర్థమవుతుంది. ఇలాంటి చిన్న ఆర్టిస్టులకి కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం రెమ్యునరేషన్ అనే మాట లేకుండా సినిమాలు చేస్తుంటారు.

కాస్త పేరొచ్చాక డిమాండ్ చేద్దామంటే తమకొచ్చే అవకాశాలు ఎక్కడ కొత్తవారొచ్చి దక్కించుకుంటారో అనే భావన. కొన్ని సినిమాలు చేసి మంచి రెమ్యునరేషన్ ఇచ్చినా ఇంట్లో బాధ్యతలకో, మానవతా దృక్పథంతో సమాజ సేవకో ధారాదత్తం చేసేయడం.. కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోయి రేపు తెల్లవారితే కదా మనకి అవసరం వీరికి ఇప్పుడు పూట గడవాలి కదా అనే ఆలోచనతో ఉన్నదంతా ఇచ్చేయడం.. ఇలాంటి సహాయాలు చేసి చివరికి దిక్కు మొక్కూ లేకుండా కఠిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందుకు ఉదాహరణ సావిత్రి లాంటి వారే.

కల్పనా రాయ్ కూడా చాలా సినిమాలకి రెమ్యునరేషన్ లేకుండానే నటించారట. వచ్చిన డబ్బు కాస్తో కూస్తో దాచుకోకుండా ఇతరులకి ఖర్చు చేసేవారని చెప్పుకుంటారు. అందుకే ఆమె అనారోగ్యం బారిన పడినా మందులు కొనుక్కోలేని పరిస్థితి గడపాల్సి వచ్చిందట.

వయసైపోయిన ముసలావిడ కాబట్టి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని.. చివరికి ఆమె మరణించాక తెలుగు సినిమా నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన అంత్యక్రియల కోసం 10 వేల రూపాయలు కేటాయించింది. ఇలా చివరి దశను అనుభవిస్తున్న నటీ నటులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago