Tag Archives: negative comments

Kumari Aunty: ఒక వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ కీర్తి.. దారుణంగా ఉందంటూ?

Kumari Aunty: కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హైదరాబాద్లో ఫుట్ పాత్ పై ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఏకంగా సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ పాపులారిటీతో ఏకంగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అత్యంత తక్కువ ధరలకు ఎంతో రుచికరమైనటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కడుపునిండా భోజనం పెడుతూ అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఈమె పాపులర్ అయ్యారు ఈమె గురించి ఎన్నో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తూ తన గురించి చెప్పడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఈమె వద్ద టెస్ట్ చేయడం కోసం వచ్చేవారు.

ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గురించి తాజాగా బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ కీర్తి తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కలసి కుమారి ఆంటీ వద్ద భోజనం చేయడానికి వెళ్ళారు. అయితే వీరు వెళ్లిన సమయంలో కుమారి ఆంటీ లేదని 170 రూపాయలకు వైట్ రైస్ చికెన్ కర్రీ తిన్నామని భోజనం ధర చాలా ఎక్కువగా ఉందని ఈమె తెలిపారు.

రుచి పెద్దగా లేదు…

ఇక ఆ ఫుడ్ తినడానికి పెద్దగా రుచి లేదని దారుణంగా ఉందని తెలిపారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు తినాలనిపించక పడేసామని మరో ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి అక్కడ భోజనం చేశామని అది కాస్త బెటర్ గా ఉందని ఈమె తెలిపారు. కుమారి ఆంటీ కంటే నేనే వంట బాగా చేస్తానని కీర్తి తెలిపారు. ఇలా కీర్తి కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగాలేదు అంటూ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెకు మద్దతు తెలుపుగా మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బపడిందని చెప్పాలి


Bigg Boss Sarayu: బిగ్ బాస్ చూస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి… అదొక చెత్త షో… సరియు కామెంట్స్ వైరల్!

Bigg Boss Sarayu: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో కూడా ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇలా ఈ కార్యక్రమం ప్రసారమవుతున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమం గురించి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా సరయు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ… ఇలాంటి రియాలిటీ షో లన్ని కూడా ఫేక్ అని తెలియజేశారు.కొనుక్కొని లేదా వారు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చి మన అనుకున్న వాళ్ళను ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఫ్లాట్ ఫామే ఈ రియాలిటీ షో. ఇలాంటి వాటిని చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి.

ఎందుకంటే తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను కనుక ఈ విషయాలు చెబుతున్నాను అంటూ ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఇలా నెగిటివ్ కామెంట్లు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొని మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Bigg Boss Sarayu: ఈ రియాలిటీ షో వల్ల టైం వేస్ట్…


ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మాత్రమే కాకుండా తిరిగి ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఈమె పాల్గొన్నారు. ఇక్కడ నాలుగు వారాలపాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈమె సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు.

బాబోయ్.. ఇంట్లో అన్నం పెట్టడం లేదు.. ఈ లాజిక్ లేని సీరియల్ ను ఇకనైనా ఆపండ్రా బాబూ.. అంటూ..

కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్‌ అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఎన్నో ట్వీస్ట్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్‌కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్‌.. లీడ్‌ పాత్రల మధ్య గొడవలు పెట్టించి సాగదీస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిగా మారింది.

దర్శకుడు కనిపిస్తే కొట్టేయాలన్న కోపంతో ఉన్నారు నెటిజన్లు. కోర్టులో జరిగిన సీన్ చూస్తే అలానే అనిపిస్తుంది. మోనిత చినిపోయినట్లు .. కార్తీక్ జైలుకు వెళ్లడం.. కట్ చేస్తే.. మొత్తం ఫేక్ అని తెలిసి.. పోలీస్ ఆఫీసర్ రోషిని బలి చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తం లాజిక్ మిస్ అవుతుందని.. అర్థం పర్థం లేకుండా డైరెక్టర్ కథను నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంత పెద్ద పోలీసు ఆఫీసర్ రోషిని సీసీ కెమెరాలు చెక్ చేయాలన్న ఆలోచన లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కార్తీక దీపం వల్ల రాత్రి ఇంటికి వెళ్తే తమకు అన్నం పెట్టడం లేదంటూ.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. లాజిక్ లేకుండా.. ఆసుపత్రిలో మోనిత పేషెంట్ కు నర్సు లేకుండా ఎలా చెక్ చేస్తుంది అంటూ.. మండిపడ్డాడు మరో నెటిజన్.

ఈ సీరియల్ చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఉందంటూ కామెంట్ చేశారు. సీరియల్ ను పొడిగించాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు తప్ప.. ఏ మాత్రం సీరియల్ లో పసలేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత చేసినా.. ఎన్ని నెగెటివ్ కామెంట్లు పెట్టినా.. ఆ సీరియల్ కు వచ్చే రేటింగ్ వస్తూనే ఉంటుంది. నెగెటివ్ గా ఉండే వాళ్లు కూడా ఉంటూనే ఉంటారు.