Kumari Aunty: కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హైదరాబాద్లో ఫుట్ పాత్ పై ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఏకంగా సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ పాపులారిటీతో ఏకంగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
అత్యంత తక్కువ ధరలకు ఎంతో రుచికరమైనటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కడుపునిండా భోజనం పెడుతూ అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఈమె పాపులర్ అయ్యారు ఈమె గురించి ఎన్నో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తూ తన గురించి చెప్పడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఈమె వద్ద టెస్ట్ చేయడం కోసం వచ్చేవారు.
ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గురించి తాజాగా బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ కీర్తి తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కలసి కుమారి ఆంటీ వద్ద భోజనం చేయడానికి వెళ్ళారు. అయితే వీరు వెళ్లిన సమయంలో కుమారి ఆంటీ లేదని 170 రూపాయలకు వైట్ రైస్ చికెన్ కర్రీ తిన్నామని భోజనం ధర చాలా ఎక్కువగా ఉందని ఈమె తెలిపారు.
రుచి పెద్దగా లేదు…
ఇక ఆ ఫుడ్ తినడానికి పెద్దగా రుచి లేదని దారుణంగా ఉందని తెలిపారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు తినాలనిపించక పడేసామని మరో ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి అక్కడ భోజనం చేశామని అది కాస్త బెటర్ గా ఉందని ఈమె తెలిపారు. కుమారి ఆంటీ కంటే నేనే వంట బాగా చేస్తానని కీర్తి తెలిపారు. ఇలా కీర్తి కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగాలేదు అంటూ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెకు మద్దతు తెలుపుగా మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బపడిందని చెప్పాలి
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…