Tag Archives: new car

Upasana: కాస్ట్లీ కారు కొనుగోలు చేసిన మెగా కోడలు.. కారు ధర ఎంతో తెలుసా?

Upasana: మెగా ఇంటి కోడలిగా అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులను నిర్వహిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సమాజ సేవ చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.

Upasana: కాస్ట్లీ కారు కొనుగోలు చేసిన మెగా కోడలు.. కారు ధర ఎంతో తెలుసా?

ఇప్పటికే ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్ లకు సహాయం చేస్తూనే మరో వైపు ఎన్నో మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ విధంగా ఉపాసన పెద్దింటి కోడలిగా, మంచి మనసున్న అమ్మాయి గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు.

Upasana: కాస్ట్లీ కారు కొనుగోలు చేసిన మెగా కోడలు.. కారు ధర ఎంతో తెలుసా?

తాజాగా ఉపాసన తన గ్యారేజ్ లోకి కొత్త కారుకు స్వాగతం పలికినట్టు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రగతి శీలంగా స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

అధునాతనమైన ఫీచర్స్..

ఇక ఈమె కొనుగోలు చేసిన ఆడి కారు కోటి 20 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. విలాసవంతమైన అధునాతనమైన ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఈ కారును కొనుగోలు చేశాం అని ఉపాసన తెలియజేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఖరీదైన కారు కొన్న బజర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్

జబర్దస్త్ శాంతి స్వరూప్ గురించి ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జబర్దస్త్ చూసే వారికి శాంతి స్వరూప్ పేరు సుపరిచితమే. అతడు ఎన్నో సంవత్సరాల నుంచి లేడీ గెటప్ వేస్తూ వస్తున్నాడు. అతడు శాంతిగా ఎక్కువగా ప్రేక్షకులకు పరిచయం. ఈయనకు సంబంధించిన ఆస్తుల గురించి మరియు కార్ల గురించి ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి.

గతంలో కూడా ఇలానే శాంతి స్వరూప్ ఆడి కారు కొన్నాడని, ఏదో టైంపాస్ కి జబర్దస్త్ లో చేస్తున్నాడు కానీ అతనికి డబ్బులు లేక కాదని చాలామంది ఆ మధ్య తెగ మాట్లాడారు. అతనికి కొన్ని లక్షలు విలువ చేసే ఆస్తులు ఎన్నో ఉన్నాయని పుకార్లు చాలానే ఉన్నాయ్. అయితే వీటన్నిటికీ శాంతి స్వరూప్ క్లారిటీ ఇచ్చాడు, ఆటోకే డబ్బులు లేని నేను ఆడి కారు ఎలా కొంటాను అని సమాధానము ఇస్తూనే… జబర్దస్త్ షోతో లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు అనే వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. ఒకవేళ లక్షల్లో సంపాదించే మాట నిజమే అయితే కొంతమందికి ఇందులో చేసేవారికి ఆర్ధిక ఇబ్బందులు ఎందుకు ఉంటాయి అన్నాడు.

అయితే జబర్దస్ లో కన్నా వారు స్పెషల్ ఈవెంట్లకే ఎక్కువ సంపాదిస్తుంటారట. ఇటీవల అతడు ఓ సొంత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. అందులో ఇంట్రెస్టింగ్ టాపిక్ పెడుతూ.. అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.

అందులో 1.25 లక్షల సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇలా యూట్యూబ్ నుండి శాంతి బానే సంపాదిస్తున్నారు. అయితే ఇటీవలే అతను ఓ కారును కొన్నాడు. అది అతని డ్రీం కార్ అట. ఈ విషయాన్నీ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో ద్వారా చెప్పాడు. ఎన్నో సంవత్సరాలుగా కస్టపడి కూడబెట్టిన డబ్బుతో తన డ్రీం కార్ ను కొనడం సంతోషంగా ఉందని అతను చెప్పాడు .

ఎన్టీఆర్ తన కొత్త కారు నెంబర్ కోసం ఎంత ఖర్చు చేసాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కి కార్లంటే ఎంతో ఇష్టం అన్న సంగతి మనకు తెలిసిందే. ఈక్రమంలోనే తనకి ఎంతో ఇష్టమైన లంబోర్ఘి ఊరుస్‌ కారును ఇటలీ నుంచి ఐదుకోట్లు ఖర్చుచేసి తెప్పించుకున్నారు. అయితే ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న కార్లలన్నింటికీ ఒకటే ఫ్యాన్సీ నెంబర్. తాజాగా ఈ కారు నెంబర్ కోసం ఎన్టీఆర్ ఎంతో డబ్బు ఖర్చుచేసి తన ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ కు 9999 అనే నెంబర్ అంటే ఎంతో సెంటిమెంట్ అన్న విషయం మనకు తెలిసిందే. గతంలో తన తాత నందమూరి తారక రామారావు,తన తండ్రి హరికృష్ణ కూడా ఇదే నెంబర్ ఉన్న కార్లను వాడటం వల్ల ఆ సెంటిమెంట్ గా ఎన్టీఆర్ కూడా ఇదే కారు నెంబర్ ను ఉపయోగిస్తున్నారు. ఈ నెంబర్ కోసం తారక్ ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చుచేసి ఈ ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకుంటారనేది గతంలో నిరూపితమైంది.

ఈ నేపథ్యంలోనే ఈ కొత్త కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం
ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేయగా, జూనియర్ ఎన్టీఆర్ TS 09 FS 9999 నంబర్ కోసం దాదాపు రూ. 17 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఇష్టమైన కారు కొన్న తర్వాత తన సెంటిమెంట్ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈ మొత్తంలో ఖర్చు చేయడం విశేషం. గతంలో కూడా తన ఫ్యాన్సీ నెంబర్ కోసం 10 లక్షలు ఖర్చు చేసి నెంబర్ దక్కించుకున్న తారక్ ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టారని తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్‌ బిడ్‌ అని అధికారులు వెల్లడించారు. కేవలం తారక్ కార్ల నెంబర్లు మాత్రమే కాకుండా ట్విటర్‌ ఖాతా కూడా @tarak9999 అని ఉండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అర్ఆర్ఆర్” చిత్రంలో కొమురంభీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ గతంలో ఎంతో విలాసవంతమైన, ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి కారును బుక్ చేశారని అది త్వరలోనే హైదరాబాద్ చేరుతుందనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుక్ చేసినటువంటి
ఇటాలియన్ లగ్జరీ లాంబొర్కిని కారు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. తారక్ ఎంతో ఇష్టంగా బుక్ చేసుకున్నటువంటి లగ్జరీ కారును ఏకంగా ఐదు కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును వేసుకుని తన స్నేహితుడు రామ్ చరణ్ ను కలవడం కోసం వెళ్లారని,ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును రామ్ చరణ్ ఇంటి ముందు పార్క్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త కార కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి “అర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి మద్య స్నేహం పెరగడంతో ఎన్టీఆర్ తన కొత్త కారులో చెర్రీని కలవడం కోసం వెళ్లారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ “అర్ఆర్ఆర్” తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. రూ.11,000 చెల్లిస్తే కొత్త కారు..?

ఈ మధ్య కాలంలో కంపెనీలు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే పండగ రోజుల్లో అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా నిస్సాన్ కంపెనీ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే కొత్త కారును బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నిస్సాన్ కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల పండగ సమయంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.

నిస్సాన్ కంపెనీ మరికొన్ని రోజుల్లో మార్కెట్ లోకి రాబోయే కొత్త మ్యాగ్నైట్ కారు ధరలను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. మ్యాగ్నైట్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే వెల్లడి కాగా డీలర్లు ఇప్పటికే అనధికారికంగా మ్యాగ్నైట్ కారు బుకింగ్ లను స్వీకరిస్తున్నారని తెలుస్తోంది. కంపెనీ అతిత్వరలో అధికారికంగా కారు బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనుంది. ఎవరైనా కారు కొనుగోలు చేయాలని భావిస్తే 11,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చెల్లించి కారును బుకింగ్ చేసుకోవచ్చు.

కారును బుకింగ్ చేసుకోవడం కొరకు సమీపంలోని డీలర్లను సంప్రదించాల్సి ఉంటుంది. నిస్సాన్ మ్యాగ్నేట్ కారు డెలివరీలు వచ్చే నెల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్ తో మార్కెట్ లోకి వస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 5.5 లక్షల రూపాయల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతీ సుజుకీ వితారా బ్రెజా, మహీంద్రా ఎక్స్‌యూవీ300, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సన్, కియా సొనేట్ లాంటి కార్లకు నిస్సాన్ కార్లు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరకే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉంది.