Upasana: మెగా ఇంటి కోడలిగా అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులను నిర్వహిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సమాజ సేవ చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇప్పటికే ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్ లకు సహాయం చేస్తూనే మరో వైపు ఎన్నో మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ విధంగా ఉపాసన పెద్దింటి కోడలిగా, మంచి మనసున్న అమ్మాయి గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు.
తాజాగా ఉపాసన తన గ్యారేజ్ లోకి కొత్త కారుకు స్వాగతం పలికినట్టు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రగతి శీలంగా స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈమె కొనుగోలు చేసిన ఆడి కారు కోటి 20 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. విలాసవంతమైన అధునాతనమైన ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఈ కారును కొనుగోలు చేశాం అని ఉపాసన తెలియజేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…