Nandamuri Balakrishna : ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్, అఖండల సక్సెస్ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత బాలకృష్ణ అనిల్ రావిపూడి తో కూడా మరో సినిమా చేయనున్నారు. గతంలో బాలకృష్ణ ప్లాప్ డైరెక్టర్లకి ఆఫర్లు ఇస్తూ సినిమాలు చేసారు, కానీ ఇపుడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తుండటంతో తనలోని మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాదు అన్ స్టాపబల్ షో చేయడానికి ఒప్పుకోవడమే కొత్తగా అనిపించింది అందరికి.
బాలయ్యలోని ఈ మార్పుకు కారణం…..
తన సినిమాల ఎంపిక నుంచి బాలకృష్ణలోని ఈమార్పుకు కారణం తన చిన్న కూతురు అయిన తేజస్విని అంటున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు అయిన తేజస్విని ఆహాలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. బాలకృష్ణను ఆ షోలో కొత్తగా చూపించడం కోసం తేజస్విని చాలా కష్టపడ్డారని సమాచారం. అంతేనా ఈ షో ఐఎండీబీలో టాప్ రేటింగ్ షో లలో ఒకటిగా నిలిచింది. బాలకృష్ణ షో కారణంగానే ఆహా ఓటీటీకి అంచనాలకు మించి సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది.
బాలకృష్ణ చేయబోయే సినిమాలు, దర్శకులు స్క్రిప్ట్ విషయాల్లో తేజస్విని చాలా శ్రద్ద చూపిస్తున్నారని సమాచారం. మొత్తానికి తేజస్విని అన్ స్టాపబుల్ కి ముందు, తరువాత అన్నట్టు బాలకృష్ణ లో మార్పు తెస్తోంది. బాలకృష్ణ కొత్త లైనప్ వెనుక కారణం కూతురు తేజస్విని అని తెలిసి బాలయ్య ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు సైతం ఎంతగానో ఆనందపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…