Bindhu Madhavi: బిందు మాధవి గత రెండు రోజులుగా ట్రెండ్ లో ఉన్న పేరు. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ విన్నర్ గా మొదటి సారి ఒక అమ్మాయి గెలవడంతో ఆడపులి అంటూ బిందు మాధవి పేరు మారుమోగిపోతోంది సోషల్ మీడియాలో. బిగ్ బాస్ కి ముందు బిందు మాధవి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు బిందు తెలుగమ్మాయి అనే విషయమే చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో పుట్టిన బిందు, శేఖర్ ఖమ్ముల ఆవకాయ బిర్యానీ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది.
ఇక ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా బిందు ఆ తరువాత పిల్ల జమిందార్, రామ రామ కృష్ణ కృష్ణ, సెగ వంటి సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీ వైపు చూసింది. ఇక తమిళంలో ఓ మోస్తారు సినిమాలు చేసినా బిందు అక్కడ బ్రేక్ కోసం బిగ్ బాస్ లోకి మిడ్ ఎంట్రీ ఇచ్చింది. టాప్ 5 కి చేరినా అక్కడ ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు. ఇక ఇపుడు ఏకంగా తెలుగు బిగ్ బాస్ విన్నర్ అయింది. అయితే విన్నర్ అయ్యిందనే సంతోషమే కానీ ఆ తరువాత సంగతేంటి అన్నదే ఇప్పుడు ప్రశ్న.
ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్స్ పరిస్థితి ఏంటి….
ఇప్పటివరకు చూసుకుంటే ఆరు సీజన్లకు గాను మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ నుండి, మొన్నటి సన్నీ వరకు వాళ్లకు బిగ్ బాస్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటో తెలీదు. శివ బాలాజీ విన్నర్ అయ్యాక ఓ రేంజ్ లో సినిమా అవకాశాలు వస్తాయని అనుకున్నారు గాని అలాంటిదేమి జరగలేదు. ఇక రెండో సీజన్ విన్నర్ కౌశల్ విషయంలో అయితే ఏకంగా ఆర్మీలే ఉండడంతో హీరో గానో, విలన్ గానో సినిమాల్లో సెటిల్ అయిపోతాడు అనుకున్నారు కానీ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన కొంతకాలానికి ఆర్మీ కూడా మరచిపోయింది. ఇక అభిజిత్, సన్నీ విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వీళ్ళలో కొంత రాహుల్ సిప్లిగంజ్ బెటర్ సింగర్ గా కెరీర్ బాగానే ఉంది కానీ ఈ మధ్య వివాదాలతో దోస్తీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బిందు మాధవి విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి కేవలం సోషల్ మీడియాలో కొన్నిరోజులు మెరిసి ఆ తరువాత మా టీవీ లో కొన్ని ప్రోగ్రామ్స్ కి వచ్చి మళ్ళీ కనుమరుగవుతోందో లేక సినిమా ఆఫర్స్ తో బిజీ అవుతుందో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…