Annamayya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన కమర్షియల్ సినిమాలలోనే కాకుండా భక్తి చిత్రాల్లోనూ నటించి అందరిని ఆకట్టుకున్నారు. నాగార్జున శ్రీరామదాసు, నమో వెంకటేశాయ, షిరిడి సాయి వంటి భక్తి కథా చిత్రాలలో నటించాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున ఎన్నో సినిమాలలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భక్తి కథా చిత్రం అన్నమయ్య.
ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. లవ్ అండ్ యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన నాగార్జున ఇలా భక్తి చిత్రాల్లో నటిస్తున్నాడని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు.కానీ ఎల్లప్పుడూ వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఆశపడే నాగార్జున మాత్రం విమర్శలను పట్టించుకోకుండా ఈ సినిమాలో అన్నమయ్య పాత్రలో నటించాడు.
ఈ సినిమాలో శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు పాత్రలో నాగార్జున నటనకి ప్రశంశలు దక్కాయి. అప్పట్లో ఈ సినిమా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకొని రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమాలో మొదట వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ కాకుండా ఇద్దరు హీరోలను సంప్రదించారు. అన్నమయ్య పాత్ర కోసం మొదట శోభన్ బాబు గారిని సంప్రదించారు. కానీ ఆయన పాత్ర కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ అడగటం వల్ల అయన్ని వద్దనుకున్నారు.
శోభన్ బాబు తర్వత అన్నమయ్య వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించటానికి బాలకృష్ణ బాగా సరిపోతాడని అనుకున్నారు. కానీ ఆ సమయంలో బాలకృష్ణ , నాగర్జున ఇద్దరు కూడా టాప్ హీరోలు . వీరిద్దరినీ ఒకే సినిమాలో ఉంచితే వారి అభిమానుల మధ్య గొడవలు జరుగుతాయని వద్దనుకున్నారు. తర్వత బాగా ఆలోచించి ఆ పాత్ర కోసం సుమన్ ని సంప్రదించారు. సుమన్ ని పిలిపించి వెంకటేశ్వర స్వామి గెటప్ వేసి ఫోటో షూట్ చేయించారు. ఆ గెటప్ సుమన్ కి బాగా సెట్ అవ్వటంతో ఇక వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…