Balakrishna: ఒక టాప్ హీరో సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు ఉండాల్సిందే . ఇక మాస్ హీరో సినిమా అయితే మినిమం గాల్లోకి జీపులు లేవాల్సిందే, అపుడే సినిమా మాస్ ఆడియన్స్ కి కన్నులపండుగగా ఉంటుంది. అలాంటిది ఇక బాలయ్య బాబు సినిమాలంటే తొడకొట్టడాలు, భారీ డైలాగులు, ఆడవాళ్ళ గొప్పతనం గురించి సంస్కృత శ్లోకాలు, ఊర మాస్ స్టెప్పులు, ఇవన్నీ లేకుండా బాలకృష్ణ సినిమా ఊహించగలమా అస్సలు లేదు. కానీ అలాంటి ఒక సినిమా బాలకృష్ణ కెరీర్ లో ఉంది. ఉన్నా కచ్చితంగా ప్లాప్ అయివుంటుంది అనుకుంటున్నారా… అస్సలు కాదు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా శోభనా, నిరోషా తో జతకట్టిన నారీ నారీ నడుమ మురారి సినిమా.
మాస్ డైరెక్టర్ తో క్లాస్ హిట్ కొట్టిన బాలయ్య….
ఫైట్స్ లేకుండా హిట్ కొట్టాడంటే ఖచ్చితంగా కే.విశ్వనాథ్ లాంటి డైరెక్టర్ సినిమా అనుకున్నారేమో, పక్కా మాస్ డైరెక్టర్ గా అప్పట్లో పేరున్న కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం ఇది. ఇక ఈ సినిమాలోని ప్రతి పాట హిట్. అంతేనా అత్త మేనల్లుడు మధ్య సాగే కథలు సినిమాలుగా తెలుగులో కోకొల్లలు ఉన్నా ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే కోదండ రామిరెడ్డి డైరెక్షన్ ఎలా ఉందొ చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యువతకు నచ్చింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, రొమాంటిక్ ట్రాక్ అప్పటి యూత్ ని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ ముందు కాసేపు అసలు హీరో కనిపించడు అయినా సరే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి బాలకృష్ణ కెరీర్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…