Bindhu Madhavi: బిందు మాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ నటిగా రానించలేకపోయింది. కానీ తమిళ బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొన్న బిందు అప్పుడు కూడా మధ్యలో ఇంటి నుండి బయటికి వచ్చింది. అయితే తెలుగూ బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంది.
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షోలో పాల్గొని మొదటి నుండి ఇంటి సభ్యులకు గట్టిపోటీ ఇస్తూ చివరికి విజేతగా నిలబడింది. ఈ నాన్ స్టాప్ సీజన్లో అఖిల్ బిందుమాధవి ఇద్దరు టైటిల్ రేసులో ఉండగా బిందు టైటిల్ దక్కించుకొని విన్నర్ గా నిలిచింది. బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ బిగ్ బాస్ టైటిల్ దక్కించుకుంది. ఇలా బిందు కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన బిందు తన ఇమేజ్ పెంచుకోవడానికి కాకుండా 40 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో బిందుకి ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం బిందు మాధవి పెళ్ళి గురించి వార్తలూ వినిపిస్తున్నాయి. సాధారణంగా అమ్మాయిలు 25 సంవత్సరాలు దాటితే పెళ్లి ప్రస్తావన వస్తుంది. ఇక సెలబ్రిటీస్ అయితే 30 దాటితే పెళ్లి గురించి ఆలోచిస్తారు. కానీ ప్రస్తుతం బిందూ మాధవి వయసు 36 సంవత్సరాలు. ఆమె పెళ్లి ఇప్పుడు వార్తలు సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల బిందూ మాధవి తండ్రి కూడా ఆమె పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ” ఇది వరకే బిందూ ని పెళ్ళి గురించి చాలా వత్తిడి చేశా. కానీ తన అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ తనకు ఫ్రీడమ్ ఇచ్చాము. ఆమె ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకుంటా అన్నప్పుడు కచ్చితంగా పెళ్లి చేస్తాం. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు అభిరుచులకు గమనిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకోవాలి” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి బిందు మాధవి పెళ్లికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…