Mahesh Babu : మహేష్ బాబు రెండు ఏళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ వచ్చిన సినిమా సర్కారు వారి పాట. కీర్తీ సురేష్ తొలిసారి జత కట్టిన ఈ సినిమా గీతా గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో వచ్చింది. ఇక సినిమా విడుదలైన మొదటి రోజున మిశ్రమ స్పందనతో పర్వాలేదు అనిపించింది. అయితే ఆ తరువాత సినిమా మీద టాక్ మారి బాగుందని అనిపించడంతో కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఇక ఈ గ్యాప్ లో మహేష్ బాబు పై మెగా అభిమానుల ట్రోల్ మొదలయింది సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా హిట్ అంటూ చెప్పుకుంటున్నారని ట్రోల్ చేసారు.
ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్….
అప్పటి వరకు సో సో గా ఆడుతున్న సినిమా మహేష్ బాబుపై ట్రోల్ల్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఇంక సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్స్ మొదలుపెట్టి రచ్చ చేసారు. ఈ ఇష్యూ వల్ల సర్కారు వారి పాట సినిమాకు లాభమే జరిగింది. డిజాస్టర్ గా మిగలకుండా బెటర్ అనే టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాకు మరో కలిసివచ్చిన అంశం వేరే పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో సినిమా లాంగ్ రన్ లో నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఇక 100 కోట్లు వసూలు చేసింది అంటూ చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసారు కర్నూల్ లో విజయోత్సవ సభ కూడా గ్రాండ్ గా చేసారు.
ఇక ఇక్కడితో చిత్ర యూనిట్ ఆపేసుంటే బాగుండేది, కానీ ఇటీవల మళ్ళీ 200 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ విడుదల చేసింది. దీంతో ఇపుడు సటైర్లు మొదలైయ్యాయి. ఇక నెక్స్ట్ మిగిలింది రౌండ్ ఫిగర్ చేసి 500 కోట్ల పోస్టర్ విడుదల చేస్తారంటు కామెంట్స్ వినిపిస్తున్నాయి. బలవంతంగా సినిమా సూపర్ హిట్ అని అభిమానులను నమ్మించవచ్చు కానీ సగటు ప్రేక్షకుడిని కాదు కదా. ఈ మాత్రం లాజిక్ లేకుండా పోస్టర్లు వేసేస్తున్నారు సర్కారు వారి పాట సినిమా వాళ్లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…