Featured

Mahesh Anand : 90’s నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

Mahesh Anand : భారీకాయం, ఆజానుబాహుడు, మహేష్ ఆనంద్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. 1989 మెగాస్టార్ చిరంజీవి నటించిన “లంకేశ్వరుడు” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రతి కథానాయకుడు మహేష్ ఆనంద్. మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగే ఈయన జీవితం.. అనుకోకుండా చీకటి కూపంలోకి నెట్టివేయబడింది. చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టపడే మహేష్ ఆనంద్ డాన్స్ కష్టపడి నేర్చుకున్నారు. అదేవిధంగా కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా పొందాడు. డాన్స్ ఎలాగూ వచ్చు కాబట్టి ఆయన ముంబైలో ఒక డాన్స్ స్కూల్ ప్రారంభించడం జరిగింది.

బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత తన కుమారుడి కోరిక మేరకు మహేష్ ఆనంద్ దగ్గర తన కొడుకును చేర్పించడం జరిగింది. అలా కొనసాగుతున్న క్రమంలో ఒకరోజు ఆ నిర్మాత మహేష్ ఆనంద్ నువ్వు సినిమాలో ఎందుకు ప్రయత్నించకూడదని అడిగాడు. మంచి ఫిజిక్ పైగా డాన్సర్ కావున సినిమా అవకాశాలు కూడా కంటిన్యూగా వస్తాయని చెప్పడంతో మహేష్ ఆనంద్ ఎగిరి గంతేశారు. ఆయన తండ్రి మరణానంతరం కుటుంబ భారాన్ని మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని తన ఒక్కగానొక్క చెల్లిని ఉన్నత చదువులు చదివించి పెళ్లి చేశాడు.

ఆ నిర్మాత అన్నట్టుగానే బాలీవుడ్ దర్శకులకు మహేష్ ఆనంద్ ఫోటోలు పంపించడం జరిగింది అలా 1984 “కరిష్మా” చిత్రంతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన మహేష్ అనేక హిందీ చిత్రాల్లో సైడ్ విలన్, విలన్ పాత్రల్లో కనిపించారు. 1988 లో చిరంజీవితో ఒక చిత్రాన్ని నిర్మించాలనుకున్నా దాసరి నారాయణరావు బాలీవుడ్ లోని అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం చూడడంతో అందులో మహేష్ ఆనంద్ ఒక విలన్ గా కనిపించారు. అలా 1989లో వచ్చిన “లంకేశ్వరుడు” చిత్రంలో సినిమా క్లైమాక్స్ లో చిరంజీవితో పోరాట సన్నివేశంలో కనిపిస్తాడు. ఆ తర్వాత బొబ్బిలిసింహం, అల్లుడా మజాకా, తెలుగువీర లేవరా, నెంబర్ వన్.. ఈ చిత్రంలో మహేష్ ఆనంద్ కామెడీ టైమింగ్ బాగుంటుంది.

ఆ తర్వాత ఘరానా బుల్లోడు, ఎస్పి పరశురాం చిత్రాల్లో మహేష్ ఆనంద్ కనిపిస్తారు. ప్రముఖ బాలీవుడ్ నటి రీనారాయ్ సోదరి బర్కారాయ్ ని పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలు కాపురం చేశారు. ఆ తర్వాత మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత “ఎరికా మెరియా డిసౌజా” 1987లో ఈ అమ్మాయిని మహేష్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1992లో మధుమల్హోత్రా ను పెళ్ళిచేసుకున్నారు. సినీ రంగుల ప్రపంచంలో ఏ తారా ఎప్పుడు రాలుతుందో ఎవరూ ఊహించలేరు. మద్యానికి తీవ్రంగా మహేష్ ఆనంద్ అలవాటుపడ్డారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు రష్యా లో స్థిరపడిన “ఉషాబచాని” అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 2005 ఉషాతో పెళ్లి మహేష్ ఆనంద్ కు కలిసొచ్చింది. సినిమాల్లో బిజీ అయ్యారు.

కానీ నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ ప్రకారం గా షూటింగ్ వెళ్లి తనకిచ్చిన సీన్స్ కంప్లీట్ చేసుకుని రావడం తెలుగు సినిమాల్లో ఉండే సంప్రదాయం.. కానీ బాలీవుడ్ లో అలా కాదు హీరోకి ఎప్పుడు వీలైతే అప్పుడే షూటింగ్.. మహేష్ ఆనంద్ కి షూటింగ్ క్రమశిక్షణ ఉండేది కాదు. సెట్ కు సరిగా రాకపోవడం, షూటింగ్ టైంకు ఉండేవారు కాదు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో.. ఎవరికీ తెలియదు. మద్యం, క్రమశిక్షణ లోపంతో సినిమాని, కుటుంబాన్ని పట్టించుకోవడం ఆయన తగ్గించారు. ఇది గమనించిన భార్య ఉషా తన కొడుకుకి ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలని మహేష్ ఆనంద్ తో చెప్పి కొడుకుతో రష్యా వెళ్ళిపోయింది. సినిమా లేవు, స్నేహితులు లేరు నాలుగు గోడల మధ్య మహేష్ తన జీవితాన్ని గడిపారు. ఇంకా మద్యానికి బానిస అయ్యారు. డబ్బు లేకపోవడంతో దినసరి కూలీ గా మారిపోయాడు. రోజు వచ్చిన డబ్బులతో మద్యం సేవించి.. ఎప్పుడో ముంబైలో “యారి” రోడ్, “వెర్సోవా” అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొన్నారు. అది ఇప్పుడు మహేష్ ఆనంద్ కి నివాసయోగ్యంగా మారింది.

అందులోనే ఉంటూ దొరికిన పనిచేస్తూ, కాలం గడుపుతున్న సమయంలో తన చెల్లెలి కాపురం చక్కబడంతో మహేష్ ఆనంద్ ను గమనించిన చెల్లి ప్రతినెల డబ్బులు పంపిస్తూండేది. పండుగల సమయంలో చెల్లి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. 2005 నుండి 2019 మధ్య మహేష్ దుర్భర జీవితాన్ని అనుభవించారు. ఇది గమనించిన ఆనాటి బాలీవుడ్ నటుడు గోవిందా తాను నిర్మించబోయే “రంగీలారాజా” చిత్రంలో మహేష్ ఆనంద్ కి అవకాశం కల్పించారు. అలా దాదాపు 18 సంవత్సరాల తర్వాత బాలీవుడ్ లోకి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు ఒకటి తరువాత ఒకటి బాగానే వచ్చాయి. కానీ మహేష్ ఆనంద్ లో మార్పు కనబడలేదు. ఇంకా ఖరీదైన మద్యం తాగుతూ డబ్బును వృధా చేసే వాడు. అదే “వెర్సోవా” అపార్ట్మెంట్ లో ఉంటూ..తాగుడుకు బానిసవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.

ఉదయం పని మనిషి వచ్చి బ్రేక్ ఫాస్ట్ ఇచ్చేది. అలా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసేది. హఠాత్తుగా ఒకరోజు పనిమనిషి డోర్ కొట్టిన మహేష్ తలుపు తీయలేదు. పనిమనిషి తాను తెచ్చిన బ్రేక్ ఫాస్ట్ డోర్ ముందు పెట్టి వెళ్ళిపోయింది. అలానే మధ్యాహ్నం కూడా పెట్టింది.. చుట్టూ ఉన్న ఇళ్ళలో పనిచేసి తిరిగి వచ్చేసరికి తలుపు తీయలేదు.పెట్టిన వస్తువులు అక్కడే ఉన్నాయి. తిరిగి రెండవ రోజు అక్కడికి వచ్చిన పరిస్థితి అలాగే ఉంది. అది గమనించి పనిమనిషి మహేష్ ఆనంద్ చెల్లికి ఫోన్ చేసింది. ఆమె వచ్చి సందేహంతో పోలీసులకు ఫోన్ చేశారు. వారంతా లోపలికి వెళ్ళేసరికి మహేష్ ఆనంద్ సోఫాలో విగతజీవిగా కనిపించారు. పక్కనే మద్యం సీసాలు, గ్లాసులు ఉన్నాయి. ఆయన చనిపోయి మూడు రోజులు కావడంతో శరీరం ఉబ్బి దుర్గంధం వస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో ఫిబ్రవరి-9-2019న మహేష్ ఆనంద్ కి గుండెపోటు వచ్చి చనిపోయారని పోలీసులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన భార్య, కొడుకులు రష్యా నుంచి వచ్చి మహేష్ ఆనంద్ దహనసంస్కారాలు చేశారు. అలా దాదాపు ఐదు పెళ్లిళ్లు చేసుకుని, క్రమశిక్షణ లేని జీవితం, మద్యం సేవించడం, నిత్యపెళ్లి కొడుకుల మారి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటం, మహేష్ ఆనంద్ మరణానికి కారణం అయ్యిందని చెప్పవచ్చు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

16 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

16 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

16 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

16 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

16 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

16 hours ago