పృథ్విరాజ్, అనూ మెహత హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాబరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పి.నాగమణి సమర్పణలో ప్రవీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పి. మణిరాజ్ మాట్లాడుతూ – “27 రోజుల పాటు వికారాబాద్, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. హీరో పృథ్విరాజ్, హీరోయిన్ అనూ మోమత చక్కగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ పూర్తి సహకారం అందించారు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఒక రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబరు నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే టైటిల్, ఫస్ట్ విడుదల చేస్తాం“ అన్నారు.
పృథ్విరాజ్, అనూ మెహత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి
సమర్ఫణ: పి. నాగమణి
బ్యానర్: పిఎస్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాత: ప్రవీణ శివరాజ్
దర్శకత్వం: పి. మణిరాజ్
సినిమాటోగ్రఫి: పరశురామ్ ఎరుగదిండి
ఎడిటర్: సి. అక్షయరాజ్
పీఆర్ఓ: శ్రీను-సిద్ధు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…