Mucherla Aruna: ముచ్చెర్ల అరుణ ఈ తరం వారికి పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ ఈమె మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోల సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ ఇండస్ట్రీని ఏలిన ముచ్చెర్ల అరుణ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.
అప్పట్లో హీరోయిన్ విజయశాంతితో తనకి ఎంతో మంచి అనుబంధం ఉండేదని ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్ళం అంటూ తెలియజేశారు. ఇక షూటింగ్ లొకేషన్లో అయితే అప్పట్లో కారవాన్ ఉండేది కాదు చెట్లకింద కూర్చుని ఎంతో సరదాగా మాట్లాడుకునేవాళ్ళం అంటూ గత విషయాలను అరుణ గుర్తు చేసుకున్నారు.
ఇకపోతే ఇంటర్వ్యూ సందర్భంగా గత విషయాలను గుర్తుచేసుకుంటూ అప్పట్లో షూటింగ్ లొకేషన్లో తన అమ్మకు హీరోలు మోహన్ బాబు, చిరంజీవి వంటి వారితో మంచి అనుబంధం ఉండేది అని వాళ్లు కూడా లొకేషన్ వారికి ఇష్టమైన వంటలను అమ్మతో తయారు చేయించుకుని తినే వాళ్లని అమ్మతో మంచి అనుబంధం ఏర్పడిందని అరుణ వెల్లడించారు.
అప్పుడు అందరం ఎంతో మంచి స్నేహంగా ఉండే వాళ్లని అయితే ప్రస్తుతం వీరితో పెద్దగా పరిచయాలు లేవని అరుణ వెల్లడించారు. కనీసం వారి ఫోన్ నెంబర్లు కూడా తన దగ్గర లేవని తెలిపారు.ఈ క్రమంలోనే చిరంజీవి గారికి మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా అంటూ యాంకర్ అడగగా లైవ్ లోనే అరుణ తనకు మెసేజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి గారు హాయ్ అని చెబుతూనే తన కూతురు పెళ్లికి తన తల్లి మిమ్మల్ని ఎంతగానో పిలవాలనుకున్నారు కానీ కుదరలేదు అంటూ అరుణ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…