Babu Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలలో కమెడియన్ గా నటించడమే కాకుండా హీరోగా కూడా నటించారు. ఇలా ఎన్నో తెలుగు సినిమాలలో తన అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన బాబు మోహన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చిన్నప్పుడే తన తల్లి చనిపోయిందని, తన తల్లి అంటే తనకు అపారమైన ఇష్టం ప్రేమ ఉండేదని బాబు మోహన్ వెల్లడించారు. ఇకపోతే తన తల్లిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునే వాన్ని కాదని, ఒకరోజు పాఠశాలలో సహ విద్యార్థి నీయమ్మ అన్నందుకు తననీ చితక బాదానని బాబు మోహన్ వెల్లడించారు.
బాబు మోహన్ హీరోగా సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడు అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా సమయంలో ఇండస్ట్రీలో పలు విమర్శలు వచ్చాయి కదా అని ప్రశ్నించారు. ఈ మాటకు బాబు మోహన్ మాట్లాడుతూ తనని ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్రశ్నించిన వారు లేరని, ప్రశ్నించేవాడు పుట్టలేదని తెలిపారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తనను అభినందించడానికి ఎంతో మంది హీరోలు అభిమానులు పెద్ద ఎత్తున స్టూడియోకు తరలి వచ్చారని బాబు మోహన్ తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో పద్నాలుగు సినిమాలకు సూట్కేస్ నిండా డబ్బు పెట్టి మా సినిమాలలో చేయాలని అడిగారు. కుదరదని చెబుతున్న పక్షంలో ఈ డబ్బులు మీరు తీసుకోకపోయినా ఎవరికైనా దానం చేయండి అని చెప్పి వెళ్లిన వారు కూడా ఉన్నారు. అలాంటివారిలో నిర్మాత రామానాయుడు కూడా ఒకరిని బాబు మోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా అందరూ తనని అభినందించిన వారే తప్ప విమర్శించిన వారు ఎవరూ లేరని ఈ సందర్భంగా బాబు మోహన్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…