Sai Pallavi : దక్షిణాదిన కేవలం నటనతో మాత్రమే గుర్తింపు తెచ్చుకుని అందరు హీరోయిన్లకు భిన్నంగా దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. నటనా ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూ అందరినీ మెప్పిస్తోన్న ఈ చిన్నది ఇటీవలే శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో అలరించింది. ఇక ప్రస్తుతం రానాతో కలిసి విరాట పర్వం సినిమా చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇపుడు ఓటీటీ లో విడుదలకు సిద్ధమైంది.
ఐటమ్ సాంగ్స్ నావల్ల కాదు…..
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ముచ్చటించిన సాయి పల్లవి ఐటమ్ సాంగ్స్ పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది. డాన్స్ ఇరగదిసే సాయి పల్లవి ఐటమ్ సాంగ్స్ చేస్తారా అన్న ప్రశ్నకు నో అని చెప్పేసింది. నాకు ఐటమ్ సాంగ్స్ చేయడం ఇష్టం లేదని, ఐటమ్ సాంగ్స్ సినిమాల్లో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పెట్టుకుంటారు అంటూ చెప్పింది. దుస్తుల విషయంలో కూడా తాను కంఫర్ట్ లేకపోతే అలాంటి బట్టలు వేయలేనని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇక ఇప్పటివరకు ఐటమ్ సాంగ్ చేయాలనే ఆలోచన తనకు రాలేదని పల్లవి చెప్పింది.
ప్రేమ, కెరీర్ గురించి….
ఇక సాయి పల్లవి ప్రేమ గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడింది. కెరీర్ ఎంత ముఖ్యమో, ప్రేమ కూడా జీవితంలో అంతే ముఖ్యమని చెప్పింది. జీవితంలో ఏదో ఒకటి లేకపోయినా వెలితిగా ఉంటుందని, కెరీర్, ప్రేమ రెండూ ఉన్నపుడే జీవితం పరిపూర్ణం అవుతుందని చెప్పింది. సాయి పల్లవి ఒక సినిమాకు దాదాపు 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది. అయితే తెలుగులో ఇంతవరకు ఏ టాప్ హీరో సరసన సినిమా చేయలేదు పల్లవి. ఇపుడు ఎన్టీఆర్, కొరటాల సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ అంటూ వార్తలోచ్చినా ఇంక పక్కా ఇన్ఫర్మేషన్ లేదు చూడాలి మరీ ఏ టాప్ హీరో సాయి పల్లవికి ఆఫర్ ఇస్తాడో.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…