Featured

Akira Nandan: సాయంలో తండ్రికి తగ్గ తనయుడు.. కరోనా సమయంలో అకీరా సేవలు… మురిసిపోతున్న పవన్ అభిమానులు…

Akira Nandan: టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో సహాయం అంటే ముందుండే కుటుంబం అంటే మెగా ఫ్యామిలీ అని చెప్తుంటారు. బ్లడ్ బ్యాంకులతో మొదలైనది ఇప్పటికి మెగా ఫ్యామిలీ పలు సేవ కార్యక్రమాలు చేస్తూనే వున్నారు. ఇక ఇటీవల కరోనా సమయంలో మరోసారి ఈ విషయం నిరూపించుకున్నారు. సినిమా పరిశ్రమ అండతో సీసీసీ ఏర్పాటు చేసి చిరంజీవి మూవీ అస్సోసియేషన్ వాళ్లకు కూడా అండదండగా నిలబడ్డారు. ఇక పవన్‌ కూడా తక్కువ ఏమి కాదు, అయితే ఈయన చేసే సహాయం బయటకు ఎక్కువగా రాదు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. ఎదుటివారికి సహాయం చేయడం లో తండ్రికి తగ్గ తనయుడిలా ఎపుడు ముందుంటాడు. ఇపుడు ఈ జాబితాలోకి మరొకరు చేరారు. అదే మన పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా నందన్.

కరోనా సమయంలో అఖిరా చేసిన సహాయం……

తాజాగా అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ స్నాతకోత్సవానికి పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరు హాజరు అయ్యారు . పవన్, రేణు, అధ్య, అకీరా ఒకే ఫ్రేమ్ లో ఫోటోలకు కనువిందు చేయడంతో అభిమానులు సర్ ప్రైజ్ అయ్యారు. అంతేకాదు ఈ వేడుకలోనే అఖిరా కరోనా సమయంలో చేసిన సహాయం గురించి స్కూల్ టీమ్ స్టేజ్ మీద చెప్పారు. కరోనా సమయంలో చాలా మంది సహాయం చేశారు. వారు చేసిన దాని గురించి మనకు తెలుసు. అయితే కొంతమది చేసిన సహాయం బయటకు తెలియదు. ఈకోవలోకే వస్తారు పవన్ కుమారుడు అఖిరా.

కరోనా సమయంలో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను హాస్పిటల్‌కు డొనేట్ చేశాడట అకీరా. దాంతో పాటు హాస్పటల్స్ కు అవసరమైన సహాయం చేశాడట. అఖిరా చేసిన సహాయం గురించి అతని వ్యక్తిత్వం గురించి, మనస్తత్వం గురించి, అందించిన సేవలు గురించి స్కూల్‌ టీమ్‌ స్టేజీ మీద చెప్పింది. అంతే కాదు అఖిరా భూమ్మీద వున్న అన్నింటికి జీవించే హక్కుందని నమ్ముతాడట, అందుకే  వేగన్ గా మారిపోయాడట. ఇక అఖిరా గురించి తెలుసుకున్న పవన్ అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు అను ఆనందంలో మురిసిపోతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago