Featured

Geetha Krishna : పడుకోకపోతే హీరోయిన్లకు అవకాశాలు రావు.. అప్పటికి ఇప్పటికి తేడా ఏమి లేదు.. : డైరెక్టర్ గీత కృష్ణ

Geetha Krishna : నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన క్లాసిక్ చిత్రమ్ సంకీర్తన. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. అలాంటి సంకీర్తన సినిమా దర్శకుడు గీతా కృష్ణ ఆ తరువాత కీచురాళ్లు, సర్వర్ సుందరం గారి అబ్బాయి, ప్రియతమా వంటి చిత్రాలను తెలుగులో చేసారు. ఇక తమిళంలోనూ సినిమాలను చేసినా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక ఆ తరువాత సినిమా డైరెక్షన్ జోలికి పోకుండా సైలెంట్ అయ్యారు.

తమిళం లో చివరగా 2013లో నిమిదంగల్ సినిమా చేసారు అదికూడా ప్లాప్ అవ్వడంతో సినిమాల జోలికి పోలేదు. కానీ ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇండస్ట్రీ గురించి బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ తనకు తాను పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీ లోని క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది మాట్లాడారు. ఇక గీతా కృష్ణ కూడా ఈ విషయం గురించి స్పందించారు. అప్పుడు హీరోయిన్లు అవకాశాల కోసం పడుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు అవకాశాలకోసం మారలేదు పరిస్థితి అన్నారు.

వీళ్ళు క్యాస్టింగ్ కౌచ్.. వాళ్లు హనీ ట్రాప్….

ఇక క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లోను ఉంది. ఒక హీరోయిన్ ఎదగాలంటే హీరో, డైరెక్టర్, నిర్మాత పక్కన పడుకోవాల్సిందే. ఇక నువ్వు కమిట్ మెంట్ ఇచ్చావా అని అడిగితే ఏ హీరోయిన్ కూడా ఇచ్చానని చెప్పదని చెప్పారు. హాలీవుడ్ లో ఈ సెక్సువల్ ఫేవర్ చేసే కాంటాక్ట్ కి ఒప్పుకుంటే అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లో అవకాశాలు వస్తాయని ఇది మొదట్లో హాలీవుడ్ లో ఉండేదని ఆ తరువాత ఇండియా కి వచ్చిందని అందునా కోలీవుడ్ లో మొదలయిందని, వాళ్ళు చాలా నాస్టీ ఫెలోస్, ఇక కన్నడ వాళ్ళు ఇంక డర్టీ ఫెలోస్ అంటూ చెప్పారు. మ్యూజిక్ ఇండస్ట్రీ లోకూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. సింగర్ గా అవకాశాలు రావాలంటే మ్యూజిక్ డైరెక్టర్స్ పక్కలో పడుకోవాల్సిందే అని అయితే అందరూ ఇలానే ఉంటారని అనడం లేదని కొంత మంది కమిట్ మెంట్ కి ఒప్పుకోని వాళ్లు కూడా ఉంటారని చెప్పాడు.

రేణుదేశాయ్ విషయంలో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పారు. ప్రభుదేవా టైం సినిమాకోసం ముంబై లో ఆడిషన్ చేస్తున్నపుడు రేణు దేశాయ్ ని తాను ఎంపిక చేయగా అందరూ ఆమె మాట వినదని చెప్పారు. అయితే ఆమెకు కాల్ చేసి సంప్రదించగా మీకు ఆటిట్యూడ్ ఉందని అందరూ అంటున్నారు అని అడిగితే నేను కమిట్ మెంట్ ఇవ్వను అందుకే అలా అంటారని చెప్పింది. ఆమె చెప్పేవరకు నాకు కమిట్ మెంట్ అంటే తెలియదని, ఆ సినిమాకోసం తననే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నా సిమ్రాన్ ను తీసుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పారు. వికి లీక్స్, హనీ ట్రాప్ గురించి కుడా స్పందించారు. ఆ అమ్మాయి క్యాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా నోరు విప్పదని అలా చెప్తే తనకు అవకాశాలు రావు, పరువుపోతుంది కాబట్టి చెప్పరని బోల్డ్ కామెంట్స్ చేసాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago