జబర్దస్త్ శాంతి స్వరూప్ గురించి ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జబర్దస్త్ చూసే వారికి శాంతి స్వరూప్ పేరు సుపరిచితమే. అతడు ఎన్నో సంవత్సరాల నుంచి లేడీ గెటప్ వేస్తూ వస్తున్నాడు. అతడు శాంతిగా ఎక్కువగా ప్రేక్షకులకు పరిచయం. ఈయనకు సంబంధించిన ఆస్తుల గురించి మరియు కార్ల గురించి ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి.
గతంలో కూడా ఇలానే శాంతి స్వరూప్ ఆడి కారు కొన్నాడని, ఏదో టైంపాస్ కి జబర్దస్త్ లో చేస్తున్నాడు కానీ అతనికి డబ్బులు లేక కాదని చాలామంది ఆ మధ్య తెగ మాట్లాడారు. అతనికి కొన్ని లక్షలు విలువ చేసే ఆస్తులు ఎన్నో ఉన్నాయని పుకార్లు చాలానే ఉన్నాయ్. అయితే వీటన్నిటికీ శాంతి స్వరూప్ క్లారిటీ ఇచ్చాడు, ఆటోకే డబ్బులు లేని నేను ఆడి కారు ఎలా కొంటాను అని సమాధానము ఇస్తూనే… జబర్దస్త్ షోతో లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు అనే వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. ఒకవేళ లక్షల్లో సంపాదించే మాట నిజమే అయితే కొంతమందికి ఇందులో చేసేవారికి ఆర్ధిక ఇబ్బందులు ఎందుకు ఉంటాయి అన్నాడు.
అయితే జబర్దస్ లో కన్నా వారు స్పెషల్ ఈవెంట్లకే ఎక్కువ సంపాదిస్తుంటారట. ఇటీవల అతడు ఓ సొంత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. అందులో ఇంట్రెస్టింగ్ టాపిక్ పెడుతూ.. అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.
అందులో 1.25 లక్షల సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇలా యూట్యూబ్ నుండి శాంతి బానే సంపాదిస్తున్నారు. అయితే ఇటీవలే అతను ఓ కారును కొన్నాడు. అది అతని డ్రీం కార్ అట. ఈ విషయాన్నీ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో ద్వారా చెప్పాడు. ఎన్నో సంవత్సరాలుగా కస్టపడి కూడబెట్టిన డబ్బుతో తన డ్రీం కార్ ను కొనడం సంతోషంగా ఉందని అతను చెప్పాడు .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…