అతడు వివాదాలతోనే కాలాన్ని గడుపుతాడు. కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తాడు.. ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది అతడు ఎవరో అని ఆలోచిస్తున్నారా.. అదేనంండి.. రామ్ గోపాల్ వర్మ. ఇక్కడ అతడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఆర్జీవికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.
తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతడు తన కొన్ని ఇంటర్వ్యూలల్లో తాను చదువుకునే రోజుల్లో చాలా బ్యాడ్ స్టూడెంట్ ను అని.. చదువుపై ఎక్కువగా శ్రద్ధ వహించేవాడిని కాదంటూ చెబుతూ వచ్చాడు. తాను ఎప్పుడూ బ్యాక్ బెంచ్ లోనే కూర్చునే వాడట. ఇంజనీరింగ్ చదివి ఫిలిమ్ మేకర్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చేవాడు.
ఇదంతా ఇలా ఉండగా.. ఇటీవల అతడు ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేసి.. ‘చదువుకునే రోజుల్లోనే నేను కూడా ఇలాంటి విద్యార్థినే’ అని పోస్ట్ చేశారు. ఆ ఫొటో వెనుకాల ఓ పెద్ద కథే ఉంది. ఆ సమయంలో పరీక్ష జరుగుతుంది. ఇద్దరు విద్యార్థులు అక్కడ కూర్చొని పరీక్ష రాస్తున్నారు. ఆ టైంలో వెనుకాల కూర్చున్న వ్యక్తి.. ముందు కూర్చున్న వ్యక్తిని జవాబులు అడుగుతుంటాడు. ఇక్కడ ఏమి రాయాలి అని అడిగితే.. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టమని ముందు కూర్చున్న వ్యక్తి వెనుకు కూర్చున్న వ్యక్తికి చెబుతాడు.
ఫుల్ స్టాప్.. స్పెల్లింగ్ చెప్పండి బయ్యా.. అంటూ అడుగుతాడు.. వెనుక కూర్చున్న వ్యక్తి. ఇలాంటి పరిస్థితి ఉంటుంది వెనుక బెంచ్ లో కూర్చున్న స్టూడెంట్ల పరిస్థితి అంటూ వర్మ ఆ ఫోటో ను షేర్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ కు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటో చూసిన ప్రతీ ఒక్కరూ దాని అర్థం తెలుసుకొని తెగ నవ్వుకుంటున్నారు.
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…