Categories: FeaturedMovie News

ఖరీదైన కారులో నందమూరి బాల‌కృష్ణ.. ఆ కారు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా..?

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు నందమూరి బాల‌కృష్ణ. అతడి చెప్పే డైలాగ్ డెలవరీ మరెవ్వరికీ సాధ్యం కాదు. అంతలా ఒదిగి డైలాగ్ లు చెబుతుంటారు. ఇన్నాళ్లు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన బాలయ్య.. త్వరలోనే బుల్లితెరపై కనిపించనున్న విషయం తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అతడు ఓ టాక్ షో చేయనున్నారు.

అన్ స్టాపబుల్ పేరుతో ప్రసారం కానున్న ఈ షోలో మెగా హీరోలతో పాటు టాలీవుడ్ స్టార్స్ పాల్గొననున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి కావడం జరిగిందని సమాచారం. ఇక ఈ టాక్ షో కోసం దాదాపు రూ. 6 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట బాలకృష్ణ. దసరా పండగ సందర్భంగా ఈ టాక్ షో ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ ఓ ల‌గ్జ‌రీ కారులో రాగా.. ఇది అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

ఆ కారు కంపెనీ పేరు బంట్లీ. దీనిని బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి.. తన తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు విలువు దాదాపు రూ. 4 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల వరకు ఉంటుందట. గ‌త కొద్ది రోజులుగా బాల‌కృష్ణ ఈ కారులోనే ప్ర‌యాణిస్తున్నట్టు స‌మాచారం. ఇక నారా బ్రాహ్మణి విషయానికి వస్తే.. ఆమె సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తన సొంత సంపాదనతో బాలయ్యకు ఖరీదైన ఈ కారును బహుమతి అందించారు.

ఇదిలా ఉండగా.. అతడు మరోవైపు లేటెస్ట్ మూవీ అఖండ షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రంపై బాలయ్య అభిమానులతో పాటు పరిశ్రమలో… ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని సినీ వర్గాల టాక్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago