Tag Archives: ntr

Actor Kalyan Ram: ఇండస్ట్రీలో ఫెయిల్ అయ్యానని హేళన చేశారు.. కళ్యాణ్ రామ్ వీడియో వైరల్?

Actor Kalyan Ram: నందమూరి వారసులుగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగుపెట్టారు నటుడు కళ్యాణ్ రామ్. బాలకృష్ణ నటించిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అనంతరం తొలిచూపులోనే అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ విధంగా కళ్యాణ్ రామ్ పలు సినిమాలలో హీరోగా నటిస్తూనే ఎంతోమంది టాలెంటెడ్ దర్శకులని తన నిర్మాణంలో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ విధంగా కళ్యాణ్ రామ్ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా ఈయన హీరోగా తెరకేక్కిన బింబిసారా చిత్రం ద్వారా ఈనెల 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో కళ్యాణ్ రామ్ చిత్రం బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న కొన్ని అవమానాలు గురించి విమర్శలు గురించి ఒక వీడియో ద్వారా బయటపెట్టారు. తనని బాలనటుడిగా ఇండస్ట్రీకి తన బాబాయ్ బాలకృష్ణ పరిచయం చేశారని తనకి సినిమా అక్షరాభ్యాసం బాబాయ్ చేశారని చెప్పుకొచ్చారు. బాల నటుడిగా పలు సినిమాలలో నటించిన కళ్యాణ్ రామ్ హీరోగా తొలిచూపులోనే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అవమానంతోనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నా..

ఈయన నటించిన మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఎంతోమంది హేళన చేశారని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.ఎక్కడో అమెరికాలో పని చేసుకుంటున్న ఇతను ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో ఫెయిల్ అయ్యారని చాలామంది విమర్శలు చేశారని అయితే తాను ఎదుర్కొన్న ఈ పరాజయం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎలా ముందుకు రావాలో తాను నేర్చుకున్నానని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi: ఈ ఫ్లాప్ సినిమా చిరంజీవిని మెగాస్టార్ చేసిందనే విషయం మీకు తెలుసా?

Chiranjeevi: ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి అగ్ర హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో ఈయన విలన్ పాత్రలలో నటిస్తూ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

ఇకపోతే ఈయనలో ఉన్న టాలెంట్ గుర్తించిన కొందరు దర్శక నిర్మాతలు ఈయనకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ విధంగా స్వయంకృషితో చిరంజీవి సినిమాలలో నటిస్తూ నేడు ఈ స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈయన బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. తద్వారా ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్నారు.

Chiranjeevi: ఆ విషయంలో విజయశాంతిని చాలా అవమానించారు.. చిరంజీవి గారికి చెబుదామంటే కలవలేక పోయాను: సీవీల్ నరసింహారావు

ఇకపోతే ఈయన పేరు ముందు మెగాస్టార్ అని రావడానికి ఓ నిర్మాత కారణమని అయితే ఈ బిరుదు ఒక ఫ్లాప్ సినిమా వల్ల వచ్చిందని విషయం చాలామందికి తెలియదు. మరి ఈయనకు మెగాస్టార్ అని బిరుదు ఇచ్చినది ఎవరు? ఇతనికి ఆ ఫ్లాప్ సినిమా రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్.రామారావు నిర్మాణంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సుమారు ఐదు సినిమాల వరకు వచ్చాయి.

ఈ సినిమాలన్నీ కూడా యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కినవే వీరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం అభిలాష, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం చాలెంజ్ రాక్షసుడు మరణం మృదంగం వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలలో మరణం మృదంగం మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

మరణ మృదంగంతో మెగాస్టార్ గా మారిన చిరు…

ఇకపోతే మరణం మృదంగం సినిమా ముందు వరకు సుప్రీం హీరోగా ఉన్నటువంటి చిరంజీవి ఈ సినిమాతో మెగాస్టార్ అయ్యారు. కె ఎస్ రామారావు మరణం మృదంగం సినిమా సమయంలో థియేటర్లో స్క్రీన్ పై తన పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదును ఉండాలని సూచించారట.అప్పటినుంచి ఈయన పేరు ముందు మెగాస్టార్ అని బిరుదు ఉంది అయితే మరణం మృదంగం సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాల తర్వాత కె ఎస్ రామారావు మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయకపోవడం గమనార్హం.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్వెల్లో భారీ ట్విస్ట్.. విఎఫ్ఎక్స్ మామూలుగా లేవుగా?

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలలో విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన రికార్డులను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా భారీ యాక్షన్ సన్నీవేషాలతో కూడిన సినిమా అనే విషయం మనకు తెలిసిందే.ఇకపోతే ఇలాంటి భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడం కోసం మేకర్స్ పెద్ద ఎత్తున గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వాడటం మనం చూస్తుంటాము.

ఈ క్రమంలోనే రాజమౌళి ఈ సినిమాలో పెద్ద ఎత్తున విఎఫ్ఎక్స్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. అయితే అవి ఎంతో సహజ సిద్ధంగా ఉండడం చూస్తుంటే టెక్నీషియన్ల పనితీరు ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య జరిగిన పలు యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వీడియోలను చూసాము.

ఇకపోతే ఈ సినిమా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది ఎన్నో క్రూర జంతువుల మధ్య సాగే ఈ ఫైట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో భాగంగా ఎన్టీఆర్ ఒక పెద్ద చిరుతను విసిరి కొడతారు. అయితే ఈ సన్నివేశం ఎంతో సహజంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ సన్నివేశంలో అక్కడ చిరుత ఏ మాత్రం లేదు. చిరుత స్థానంలో ఒక బాల్ ఉపయోగించి ఈ సన్నివేశాన్ని తెరకెక్కించారు.

ఎన్టీఆర్ చిరుతకి బదులు బాల్ విసిరారా…

ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా మేకర్స్ విఎఫ్ఎక్స్ ఉపయోగించి చిరుతను సెట్ చేశారు. ఎవరు గుర్తుపట్టలేనంత విధంగా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన మేకింగ్ వీడియోని విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్ షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో చిరుత స్థానంలో బాల్ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

Flash Back : ఒకే టైటిల్ తో వచ్చిన ఎన్టీఆర్, రాజశేఖర్ చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద అలా ఆడాయి.!!

Flash Back : “మగాడు” 1976లో విడుదలైన భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం దీనిని లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావు మరియు శ్రీకాంత్ నహతా నిర్మించారు మరియు SD లాల్ దర్శకత్వం వహించారు. కెవి మహదేవన్ సంగీతం అందించినఈ చిత్రంలో ఎన్‌టి మారావు, రామకృష్ణ, మంజుల మరియు లత నటించారు. ఇది హిందీ చిత్రం దీవార్ (1975)కి రీమేక్.

కష్టపడుతున్న కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి ట్రేడ్ యూనియన్‌వాది ఆనంద్ బాబు యొక్క బలమైన నాయకత్వంలో నిరసనతో చిత్రం ప్రారంభమవుతుంది. ఆనంద్ బాబు తన భార్య శాంతమ్మ మరియు ఇద్దరు కుమారులు విజయ్ & రవితో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం అతనికి లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతను ఇవ్వలేదు, అప్పుడు వారు అతని కుటుంబానికి ప్రాణహాని చూపిస్తారు, కాబట్టి, అతను వారికి లొంగిపోయాడు. కోపంతో, కూలీలు అతనిపై దాడి చేస్తారు, అందరూ అతన్ని ద్రోహిగా చూస్తారు.ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ అంశం.

“మగాడు” 1990 లో కె. మధు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో రాజశేఖర్, జీవిత, లిస్సీ, మురళీ మోహన్ తదితరులు నటించారు. ఈ చిత్రం 1988లో మలయాళంలో వచ్చిన “మూన్నం ముర” చిత్రానికి రీమేక్. రాజశేఖర్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఇది తమిళంలో “మీసైకరణ్ ” పేరుతో డబ్ చేయబడి విడుదలైంది, ఇదికూడా విజయవంతమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన “అంకుశం” చిత్రం తర్వాత రాజశేఖర్, జీవిత కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం “మగాడు” బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలువగా.. ఎన్టీఆర్ నటించిన “మగాడు” చిత్రం యావరేజ్ గా నిలిచింది.

Sridhar : ఎన్‌టిఆర్‌ తో ఆ సినిమా చేయడం వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయా!?

ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి నంటే ఎవరైనా నమ్మగలరా..అవును ఇది వాస్తవం. నందమూరి తారక రామారావు హీరోగా నటించిన
ఎన్నో సినిమాలతో ఎంతో మంది కొత్త నటీ నటులు సాంకేతిక నిపుణులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. వారిలో చాలామంది సక్సెస్ సాధించారు కూడా. ఎన్‌టిఆర్‌ సొంత నిర్మాణ సంస్థలో తీసిన సినిమాల ద్వారా కూడా చాలా మందికి ఆయన లైఫ్ ఇచ్చారు. అప్పటి తరం వారెవైరైనా ఇప్పుడు ఉంటే ఎన్‌టిఆర్‌ వల్ల వారు సహాయం పొందిన వారైతే ఖచ్చితంగా ఆ విషయాలను, సందర్భాలను చాలా గొప్పగా చెప్పుకుంటారు.

Sridhar : ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి.!

అలాంటి ఎన్‌టిఆర్‌ మూలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలగాల్సిన ఓ నటుడు మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దురదృష్ఠవశాత్తు అది ఎన్‌టిఆర్‌ సినిమాల వల్లే కావడం ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఆ నటుడెవరో కాదు ముత్యాల ముగ్గు సినిమాతో మంచి గురింపు ..పేరు తెచ్చుకున్న శ్రీధర్. ఆయన అసలు పేరు సూరపనేని శ్రీధర్. 1939 డిసెంబర్ 21న కృష్ణా జిల్లా, ఉయ్యూరు దగ్గర్లోని కుమ్మమూరు గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అప్పటి నటీ నటుల మాదిరిగా శ్రీధర్ కూడా నాటక రంగంలో పలు నాటకాలు వేసి రంగస్థలం మీద పాపులర్ అయ్యాడు. అలా పాపులారిటీ తెచ్చిన నాటకాలు పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు వంటివి. వీటిలో అతను పోషించిన ప్రధాన పాత్రలకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో తల్లా? పెళ్లామా? సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

Sridhar : ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి.!

నటనపరంగా శ్రీధర్‌కు ముందు నుంచే మంచి పేరు తెచ్చుకున్నాడు. నటుడుగా మూడు దశాబ్దాలపాటు మంచి పాత్రలు పోషించి దాదాపు 150 సినిమాలలో నటించాడు. శ్రీధర్‌కు తెలుగులో బాగా పేరు తెచ్చిన సినిమా ముత్యాల ముగ్గు. ఈ సినిమాతో గుర్తింపు పొందిన శ్రీధర్ ఎక్కువగా అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన దాదాపు చాలా సినిమాలలోనూ మంచి పాత్రలు పోషించాడు. ఇండస్ట్రీలో ఇతనికి బాగా సపోర్ట్ చేసింది అంటే కృష్ణ గారే.

Sridhar : ఆ సినిమా నటించడం వల్లే శ్రీధర్ కు హీరో అవకాశాలు తగ్గాయా?

జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీరామారావు కొడుకుగా నటించి ఆకట్టుకున్నాడు. శ్రీధర్ మంచి టాలెంటెడ్ హీరో. కానీ ఆయనకు హీరోగా సరైన అవకాశాలు దక్కలేదు. అయినా ఏనాడు వేషాలకోసం నిర్మాతల ఆఫీసుల చుటూ, దర్శకుల చుట్టూ తిరిగింది లేదట. అవకాశం వచ్చిన సినిమాలలో పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టి నటించాడు. ఇక మరో స్టార్ హీరో శోభన్ బాబు ఇన్స్పిరేషన్‌తో నటుడిగా ఉండగానే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టి..బాగా సంపాదించారు. ఈ వ్యాపారం తనకు బాగా కలిసొచ్చింది.

Sridhar : ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి.!

హీరోగా నటిస్తున్న సమయంలో శ్రీధర్‌ తోటి ఎన్‌టిఆర్‌ తన స్వంత చిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. ఇది తనకు బాగా కలిసొస్తుందనుకున్నాడు. కానీ ఇదే అవకాశాలు లేకుండా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అంతకు ముందు ఎన్‌టిఆర్‌ గుహుడు వేషానికి డ్రైవర్‌ రాముడులో సెకెండ్‌ హీరో వేషానికి ఏదో లింకుపెట్టి ఇచ్చారట. అయితే డ్రైవర్‌ రాముడు సూపర్ హిట్  సాధించింది. అయినా శ్రీధర్‌ కు హీరో అవకాశాలు దక్కలేదు. ఈ రకంగా శ్రీధర్‌కు సూపర్ హిట్‌ చిత్రాలలో నటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అతను నటించిన చిత్రాలలో అమెరికా అమ్మాయి, అడవి రాముడు, జస్టిస్‌ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక శ్రీధర్ నటించిన ఆఖరి సినిమా నాగార్జున – శ్రీదేవి జంటగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన
గోవిందా గోవిందా. 

Jayaprada: ఎన్టీఆర్ గారు రోడ్డుపై స్నానం చేయడం ఏంటీ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రద!

Jayaprada: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒకవైపు ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతూనే రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రజల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇప్పటికీ రాజకీయాలలో ఎన్టీఆర్ సేవలను కొనియాడుతూ ఉన్నారంటే ఆయన సేవలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు.

Jayaprada: ఎన్టీఆర్ గారు రోడ్డుపై స్నానం చేయడం ఏంటీ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రద!

ఇకపోతే నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయనతో కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి రాజకీయాలలో కూడా తనతో కలిసి ప్రయాణం చేసిన నటి జయప్రద ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీ రామారావు గురించి ఈమె ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు.

Jayaprada: ఎన్టీఆర్ గారు రోడ్డుపై స్నానం చేయడం ఏంటీ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రద!

ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తి తోనే తాను ఇండస్ట్రీలోకి రాజకీయాలలోకి వచ్చానని ఆమె తెలియజేశారు. ఆయన ఇండస్ట్రీలో అగ్ర నటుడు అయినప్పటికీ ముఖ్యమంత్రిగా కూడా ఎంతో చక్కగా బాధ్యతలను నిర్వర్తించారు. పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ఆయన ఎంతో తపన పడ్డారని జయప్రద ఈ సందర్భంగా తెలిపారు.

సాధారణ జీవితాన్ని గడుపుతారు..

ఎన్టీ రామారావు గారి నుంచి మనం ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. ఆయన అంత పెద్ద హోదాలో ఉండి కూడా గంజి అన్నం తినడం ఏంటి, రోడ్లపై పంపు కింద స్నానాలు చేయడం ఏంటి.. ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఇలాంటివి ఎందుకు చేయలేము.. ఆయనలా కాకుండా ఆయన నుంచి ఆయన డిసిప్లేన్, సింప్లిసిటీ, ఆయన సిన్సియారిటీని ఫాలో కావచ్చు అంటూ ఈమె సీనియర్ ఎన్టీఆర్ గురించి అతనితో తనకున్న అనుబంధం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

NTR : అతిపెద్ద డైలాగ్ తో ఎన్టీఆర్ విజృంభన.. ఈ కోర్టు సన్నివేశం చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.!!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దాదాపుగా ఆయన వేయని పాత్ర అంటూ ఇక లేదేమో అనిపిస్తుంది. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో తన నటనా కౌశలంతో అద్భుతమైన పాత్రలు ధరించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది. సర్దార్ పాపారాయుడు చిత్రంలో స్వతంత్ర సమరయోధుడిగా, జస్టిస్ చౌదరిలో న్యాయమూర్తిగా, కొండవీటి సింహంలో బాధ్యతాయుతమైన పోలీసాఫీసర్ గా, బొబ్బులిపులిలో దేశ సేవలో పునీతుడైయిన మేజర్ చక్రధర్ పాత్రలలో.. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఈ నాలుగు పాత్రలు కీలక భూమికను పోషిస్తాయి.

అలాంటి అద్భుతమైన పాత్రలను పోషించి సమాజంలో ఉన్న అవినీతి, అన్యాయం లాంటి అప్రజాస్వామ్య విధానాలను కూకటివేళ్ళతో పెకిలించారు. బెబ్బులిపులి చిత్రం నిర్మిస్తున్న వడ్డే రమేష్ కథ, సంభాషణలు దాసరి రాసుకుంటున్న క్రమంలో.. మిగతా సాంఘిక చిత్రాల కంటే భిన్నంగా బొబ్బులిపులి సినిమా క్లైమాక్స్ ఉండాలి. అది చరిత్రలో మర్చిపోని సన్నివేశం కావాలని దాసరితో వడ్డే రమేష్ చెప్పారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకున్న దాసరి ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఏవిఎమ్ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ సెట్ కు వస్తారు. దాసరి నారాయణరావు ఎనిమిది గంటలకే లొకేషన్ లో ఉన్నారు. ఎందుకనో కోర్టు సీన్ ఇంకా బాగా రావాలనే ఉద్దేశంతో రాసిన పేపర్స్ పక్కకు పెట్టి కొత్త సంభాషణలు దాసరి రాయడం ప్రారంభించారు.

సరిగ్గా తొమ్మిది గంటలకు అన్నగారు లోకేషన్ కు వచ్చారు. సిన్సియర్ గా డైలాగ్స్ రాస్తున్న దాసరిని ఇబ్బంది పెట్టకుండా సెట్లో ఓ మూలాన కూర్చున్నారు. దాదాపు 35 పేజీలతో కోర్టు సన్నివేశాలు, సంభాషణలు ఉ.11 గంటల వరకు రాశారు. లేచి చూసే సరికి అక్కడ ఎన్టీఆర్ కనిపించారు. మేము గమనించాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే అలా పక్కనే కూర్చున్నామని చెప్పడంతో.. దాసరి రాసిన ఎమోషనల్ డైలాగ్స్ ఒకసారి ఎన్టీఆర్ కి వినిపించారు. ఆయన ఏమీ మాట్లాడకుండా.. షూటింగ్ మధ్యాహ్నం పెట్టుకుందామని ఎన్టీఆర్ అనడంతో దాసరి, ఎన్టీఆర్ కు ఏదైనా పని ఉండవచ్చని భావించారు. కానీ ఆ డైలాగ్స్ పేపర్స్ తీసుకుని ఎన్టీఆర్ చెన్నైలోని మెరీనాబీచ్ కి వెళ్లారు. ఎవరూ లేని చోటుకి వెళ్లి ఆ సంభాషణలు ప్రాక్టీస్ చేశారు. తిరిగి మధ్యాహ్నం లొకేషన్ (ఏవిఎమ్ స్టూడియో)కు చేరుకున్నారు.

కోర్టులో శ్రీదేవి న్యాయవాదిగా కేసుకు సంబంధించిన వివిధ ప్రశ్నలతో ఎన్టీఆర్ ని ప్రశ్నిస్తుంది. ఈ వాదనల అనంతరం.. నేను పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా యువరానర్ అని మేజర్ చక్రధర్(ఎన్టీఆర్) ప్రశ్నించగా.. అవును అని న్యాయమూర్తి సమాధానమిస్తారు. పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్ అని అడుగగా.. శిక్ష తగ్గించవచ్చు లేదా ఇదే శిక్ష ఖరారు చేయవచ్చు అని న్యాయమూర్తి బదులిస్తారు… ఈ కోర్టు వేసిన శిక్షను ఆ పై కోర్టులో పోవచ్చు లేదా ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు లేదా అదే శిక్ష ఖరారు కావచ్చు.. అంటే ఒక కోర్టుకి మరొక కోర్టు కి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.. ఇలా కోర్టు కోర్టు కు తీర్పు తీర్పు కి ఇంత మార్పు ఉంటే.. మీ కోర్టులో న్యాయం ఉన్నట్టా యువరానర్.. ఒక్కొక్క కోర్టుకి ఒక్కో తీర్పు ఉండడం చేతనే నేరస్తుడు తను చేసిన నేరం మర్చిపోయాకగాని శిక్ష పడుతుంది..

తెలివిగల పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామరాజును చంపావా? భీమరాజును చంపావా? అంటూ అడిగారేగాని వారిని ఎందుకు చంపావు? అని ఎందుకు అడగలేదు యువరానర్.. అంటూ మేజర్ చక్రధర్ పాత్రలో ఎన్టీఆర్ తన వాక్పటిమతో, కోర్టు హాలు దద్దరిల్లేలా ప్రత్యేక డైలాగ్ డిక్షన్ తో వీరవిజృంభణ చేశారు. 15 నిమిషాల నిడివి గల ఆ కోర్ట్ సన్నివేశం చూస్తున్న సగటు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అన్నగారి నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ ఒక్క సన్నివేశం తోనే బొబ్బులిపులి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత వచ్చిన అనేక తెలుగు చిత్రాలకు ఈ కోర్టు సీన్ ఒక ప్రేరణగా నిలిచింది.

Eduruleni Manishi : ఎన్టీఆర్, నాగార్జున నటించిన ఈ చిత్రాలలో.. ఒక్కరు మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచారు.!!

“ఎదురులేని మనిషి” 1975, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చిత్రం. నిర్మాత చలసాని అశ్వినీదత్ తొలిచిత్రం. వైజయంతి మూవీస్ పతాకం పై నిర్మించబడింది. రామారావు కొత్తపంధాలో ఈ చిత్రంలో కె.బాపయ్య చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు మూడింటిలోనూ అప్పటికి ఎన్.టి.ఆర్ ఇమేజికి భిన్నంగా చిత్రంలో చూపబడ్డారు.ఈ సినిమాకు మూలం “జానీ మేరా నామ్”. సంక్షిప్తంగా కథలోకి వెళితే…

ఈ చిత్రం శేఖర్ (ఎన్. టి. రామారావు) తో ప్రారంభమవుతుంది. తన బాల్యంలో అతని తండ్రి (సత్యనారాయణ) ని ఇద్దరు భయంకరమైన దుర్గార్గులైన రంగా (ప్రభాకర్ రెడ్డి) & సర్కార్ (కాంతారావు) లు హత్య చేస్తారు. ఆ హత్య జరిగినపుడు వారిని గుర్తించి తన తమ్ముడు గోపీతో సహా పారితోతాడు. కాలక్రమంలో వారు విడిపోతారు.

తండ్రిని హత్య చేసిన వారిపై పగ సాధించాలన్న పట్టుదల, తమ్ముని కలుసుకోవాలన్న ఆవేదన పట్టుదల కలిగి అతను ఎవరికీ తలఒగ్గడు.స్మగ్లర్ల కార్యకలాపాలను అడుగడుగునా అడ్డు తగులుతాడు. అతనికి లత పరిచయమవుతుంది. ఆమె గత్యంతరంలేక స్మగ్లర్ల చేతిలో బందీ అయిందని పరిచయం పెరిగిన తర్వాత తెలుసుకుంటాడు.ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం..

“ఎదురులేని మనిషి” జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో 2001 లో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, సౌందర్య, షెహనాజ్, నాజర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కామాక్షీ మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించారు.కథలోకి వెళితే..

సూర్యమూర్తి ఊరికి పెద్దమనిషి. ఊర్లో అందరూ అతన్ని గౌరవంగా చూస్తుంటారు. సూర్యమూర్తి తన తాత, బామ్మ, ఒక చిన్న పాపతో కలిసి ఉంటాడు. అతని లాగే ఉండే తమ్ముడు సత్య హైదరాబాదులో కంప్యూటర్ సైన్సులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వస్తాడు. సత్యకి తెలుగు తెలియని ఒక అమ్మాయి స్నేహితురాలిగా ఉంటుంది. సూర్యమూర్తి పెళ్ళి వయసు వచ్చినా జీవితాంతం పెళ్ళి చేసుకోనని అంటూ ఉంటాడు. కానీ అతనికి ఎలాగైనా పెళ్ళి చేయాలని అమ్మాయికోసం వెతుకుతుంటాడు సత్య.అప్పుడే అతనికి వసుంధర తారసపడుతుంది.

కొన్ని సంఘటనల తర్వాత ఆమె సూర్యమూర్తితో పెళ్ళికి ఒప్పుకొంటుంది. అప్పుడే ఆమెకు ఒక నిజం తెలుస్తుంది. తన అక్క భవానిని పెళ్ళి చేసుకుంది సూర్యమూర్తి, సత్య అన్న అనీ, సూర్యమూర్తి వల్ల అతను చనిపోయాడనీ తన కుమార్తె రాణిని సూర్యమూర్తి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం. ఎన్టీ రామారావు నటించిన “ఎదురులేని మనిషి” చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా నాగార్జున నటించిన “ఎదురు లేని మనిషి” సినిమా పరాజయం పొందింది.

Bhale Thammudu : ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ మొత్తం పాటలు పాడిన మొదటి తెలుగు సినిమా.. పాటలు హిట్టే.!! సినిమా హిట్టే.!!

Bhale Thammudu : ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ చిత్రాల పాటలతో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.

రఫీతో జగ్గయ్య తొలిసారి తెలుగులో పాడించారు. భక్త రామదాసు (నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు నేపథ్యగానం చేశారు. ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు. (భలే తమ్ముడు, తల్లా? పెళ్ళామా?, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి. ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్.టి.ఆర్, హరికృష్ణ, బాలకృష్ణ లకు) రఫీ పాటలు పాడారు. భలేతమ్ముడు చిత్రంలో రఫీ మొత్తం పాటలు పాడారు అవి బహుళ ప్రేక్షకాదరణ పొందాయి.

“భలే తమ్ముడు” 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన ‘చైనా టౌన్’ ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి ఆ స్థానంలో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు. (తర్వాత కాలంలో వచ్చిన డాన్ (తెలుగులో యుగంధర్) ఇదే ఇతివృత్తంతో తయరయ్యాయి. మహమ్మద్ రఫి పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె’ మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి. ఈ చిత్ర కథాంశాన్ని గమనిస్తే..

ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ (మిక్కిలినేని) ఒక ప్రమాదకరమైన గ్యాంగ్‌కి చెందిన ఘోరమైన గ్యాంగ్‌స్టర్‌లకు శిక్ష విధించడంతో సినిమా ప్రారంభమవుతుంది మరియు వారి చీఫ్ గణపతి / గన్ (రాజనాల) అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడు, కాబట్టి, అతను అతన్ని చంపి అతని కవల కొడుకులలో ఒకరైన రామ్ ప్రసాద్‌ని కిడ్నాప్ చేస్తాడు. రామ్ వారి మధ్య పాల్ (NT రామారావు) పేరుతో పెరిగి డేర్‌డెవిల్ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఒకసారి, ఒక దోపిడీలో, పాల్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇన్‌స్పెక్టర్ శేఖర్ (ప్రభాకర్ రెడ్డి) అతన్ని రహస్యంగా దాచిపెట్టి నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు, చాలా హింసించిన తర్వాత కూడా అతను నిరాకరించాడు. షామ్ ప్రసాద్ (మళ్ళీ NT రామారావు), తన తల్లి (శ్రీరంజని జూనియర్) ద్వారా పెరిగిన చిన్నవాడు, రావు సాహెబ్ (రేలంగి) కుమార్తె గీత (KR విజయ)ను ప్రేమిస్తున్న క్లబ్ గాయకుడు. రావ్ సాహెబ్ వారి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకున్నాడు, కాబట్టి అతను తన కుమార్తెను హైదరాబాద్‌కు తీసుకువెళతాడు మరియు షామ్ కూడా అనుసరిస్తాడు. 

ఒక రాత్రి, షామ్ గీత ఇంట్లోకి ప్రవేశించాడు, రావ్ సాహెబ్ అతన్ని అరెస్టు చేస్తాడు. ఇన్‌స్పెక్టర్ శేఖర్ పాల్ & షామ్‌ల మధ్య పోలికలను గమనించి అతనికి CID ఉద్యోగాన్ని అందజేస్తాడు మరియు అతనిని పాల్‌గా తమ గ్యాంగ్‌లోకి పంపాలని నిర్ణయించుకున్నాడు. షామ్ తన పెద్ద కొడుకు రామ్ ప్రసాద్ అని గుర్తించి అతనిని కలిసినప్పుడు పాల్ గురించి తన తల్లికి చెప్పాడు, కానీ పాల్ ఆమెను తిరస్కరించాడు. ఇప్పుడు షామ్ ఆ పనిని చేపట్టడానికి సిద్ధమవుతాడు మరియు పాల్ లాగానే అతను సురక్షితంగా ముఠాలోకి దిగాడు. 

పాల్ యొక్క ప్రేమికుడు లీల (విజయ గిరిజ) తప్ప గ్యాంగ్‌లోని అందరూ అతనిని నమ్ముతారు, అతను అతని పాత్రను అనుమానించి నిజాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు షామ్ మొత్తం కథను వెల్లడించాడు, ఆమె సహాయం కోరతాడు మరియు ఆమె అంగీకరించింది. అది వింటూ, గన్ షామ్‌ని పట్టుకున్నాడు. ఇంతలో, పాల్ ఆరోగ్యం క్షీణిస్తుంది; ఆసుపత్రికి తరలిస్తుండగా, అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. శ్యామ్‌గా భావించి గీత అతన్ని కాపాడింది. మరియు షామ్ మోసం గురించి తెలుసుకున్న పాల్ ఆమెను గుహలోకి తీసుకువెళతాడు. ఆ కోపంలో, లీల తన దారికి అడ్డుపడి వాస్తవాన్ని బయటపెట్టినప్పుడు అతన్ని కొట్టడం ప్రారంభించాడు. ఇక్కడ పాల్ తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడతాడు మరియు షామ్ అతనిని ఓదార్చాడు. చివరికి, సోదరులిద్దరూ ఒకటవుతారు, 1969లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

Flash Back : ఏంటీ ఈ పాటకు నేను డ్యాన్స్ చేయాలా…? స్టార్ ప్రొడ్యూసర్ తో ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!?

Sr. NTR: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బడా బ్యానర్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లో మొట్టమొదటి సారిగా తెరకెక్కిన చిత్రం ఎదురులేని మనిషి. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించారు.

1975 డిసెంబర్ 12వ తేదీ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాలలో మాదిరి కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ మార్చి యవ్వనంగా కనిపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో కసిగా ఉంది అనే పాట ఉంది. ఈ పాట విన్న తర్వాత ఎన్టీఆర్ ఏంటి ఈ పాటకు నేను డాన్స్ చేయాలా.. అంటూ అశ్వనీదత్ తో అన్నారు.ఈ మాటకు అశ్వనీదత్ మాట్లాడుతూ నేను మీకు పెద్ద అభిమానిని మిమ్మల్ని ఇలా చూడాలనుకోవడం నా కోరిక. ఇలాగే నాలాంటి ఎంతోమంది అభిమానులు కూడా మీలో కొత్తదనాన్ని కోరుకుంటారు అంటూ అశ్వనీదత్ చెప్పారు.

ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మారాను…

ఇక అశ్వినీదత్ మాటలు విన్న ఎన్టీఆర్ ఏమాత్రం మాట్లాడకుండా వారు చెప్పిన విధంగా ఈ సినిమాలో కసిగా ఉంది అనే పాటకు వాణిశ్రీ తో కలిసి చిందులు వేశారు. ఇక ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వంద రోజులు ఈ వేడుకలో మాట్లాడుతూ.. ప్రజలలో మారిన అభిరుచులకు అనుగుణంగా తాను మారానని, అశ్వినీదత్ చెప్పిన విధంగానే నేను చేశానని ఎన్టీఆర్ వందరోజుల వేడుకలో వెల్లడించారు.