Tag Archives: number one

Rajinikanth: ఆ విషయంలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా రికార్డ్ అందుకున్న రజనీకాంత్?

Rajinikanth: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీనియర్ హీరో రజనీకాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఈ ఏడాది రెమ్యూనరేషన్ విషయంలో ఇండియాలోనే టాప్ హీరోగా రజనీకాంత్ రికార్డు సృష్టించారు. 2023 వ సంవత్సరంలో పలు భాష హీరోలు వివిధ సినిమాల ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.

ప్రభాస్ నటించిన సలార్ విజయ్ లియో రజనీకాంత్ జైలర్, సల్మాన్ ఖాన్ టైగర్ 3, షారుక్ ఖాన్ జవాన్, డంకీ, పఠాన్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ హీరోలలో అధికంగా రెమ్యూనరేషన్ రజనీకాంత్ తీసుకున్నారని తెలుస్తుంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించినటువంటి చిత్రం జైలర్ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా నిర్మాత భారీగా లాభాలను పొందడంతో చిత్ర బృందానికి ఖరీదైన కానుకలను అందించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రజనీకాంత్ కు డబ్బులు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.

రజనీ తర్వాత ప్రభాస్…

ఇలా ఈ ఏడాది అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి స్టార్ హీరోగా ఇండియాలోనే రజినీకాంత్ రికార్డు సృష్టించారని తెలుస్తోంది. ఈయన తర్వాత ప్రభాస్ అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఆ తర్వాత షారుక్ ఖాన్ తర్వాత సల్మాన్ ఖాన్ అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి హీరోల జాబితాలో ఉన్నారని తెలుస్తుంది.

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

ఆ సంవత్సరంలో స్టార్ హీరోలైన కృష్ణ, చిరంజీవి, నాగార్జున బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేశారు. సంక్రాంతి కానుకగా ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. అందులో ముందుగా విడుదలైన “ముగ్గురు మొనగాళ్ళు” 1994, జనవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. 

అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, నగ్మా, రమ్యకృష్ణ, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో చిరంజీవి మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేశాడు. రంగనాథ్, శ్రీవిద్య తమ కుమారులు పృథ్వీ, విక్రమ్, దత్తాత్రేయ (చిరంజీవి త్రిపాత్రాభినయం)లతో ఒక గ్రామంలో నివసిస్తున్నారు. ఒక కేసు విషయంలో రంగనాథ్ ను శరత్ సక్సేనా చంపివేస్తాడు.

గర్భవతి అయిన శ్రీవిద్య పారిపోతూ పృథ్వీ నుండి విడిపోతుంది. గూండాల నుండి తప్పించుకునేటప్పుడు తన కొడుకు చంపబడ్డాడని అనుకుంటుంది. ఒక ఆలయంలోకి వెళ్ళి అక్కడ కవలలకు జన్మనిస్తుంది. సంతానం లేని పూజారి ఒక కొడుకును దత్తత తీసుకుంటాడు, శ్రీవిద్యతో ఉన్న విక్రమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవుతాడు. దత్తాత్రేయ నృత్య ఉపాధ్యాయుడు. సోదరులు ఒకరినొకరు, తల్లిని ఎలా కలిసారు, విలన్లపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనేది మిగతా కథ.

నెంబర్ వన్ 1994 జనవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం.ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి అందించారు.ఈ చిత్ర గీతాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కృష్ణ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ శ్రీ షిర్డీ సాయి ఫిల్మ్స్…. తల్లితండ్రులు చనిపోగా అనాథగా మారిన ఒక కుటుంబాన్ని పెద్ద కుమారుడు ఎలా పోషించి ప్రయోజకత్వం సాధించాడనేది కథ. పెద్ద కుమారుడిగా ఘట్టమనేని కృష్ణ నటించారు. కృష్ణ ఇందులోని పాటలలో శివాజీ తదితర వేషాలలో కనిపించారు.

తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
1994 జనవరి 21 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో “గోవిందా గోవిందా” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. త్రేతా యుగం, కలియుగం మధ్య కాలంలో శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా ఎందుకు భూమి వెలశాడో తెలిపే కథతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కథ ప్రస్తుతం లోకి వస్తే బ్యాంకాక్ లోని ఓ తాంత్రికుడు వేంకటేశ్వరుడి కిరీటానికి ఓకన్యను బలి ఇవ్వడం ద్వారా, టెలి కైనెసిస్ అనే ప్రక్రియ ద్వారా లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

తిరుమల ఆలయంలోని ఆ కిరీటాన్ని దొంగిలించే బాధ్యత ముంబై లో పేరుమోసిన దొంగయైన పరేష్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. చిన్నప్పటి నుంచి బ్యాంకాక్ లో పెరిగిన నవీన అనే యువతి తన తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో భారతదేశంలో తాడేపల్లి గూడెంలో ఉన్న తన బామ్మను వెంటతీసుకుని వెళ్ళడానికి వస్తుంది… ఆ సంవత్సరం జనవరి నెలలో ఒక వారం తర్వాత మరొక చిత్రం బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాయి.. నాగార్జున హీరోగా నటించిన “గోవిందా గోవిందా ” చిత్రం పరాజయం పొందింది, మెగాస్టార్ నటించిన “ముగ్గురు మొనగాళ్ళు” “యావరేజ్ హిట్ గా నిలవగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన “నెంబర్ వన్” చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.