Tag Archives: nutrition

గర్భం దాల్చిన మహిళలు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలివే..!

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వారు తీసుకొనే ఆహారం నుంచి చేసే ప్రతి పని వరకు అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి డెలివరీ అయిన కొన్ని నెలల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తల్లి ,బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భందాల్చిన మహిళలు తగినన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

గర్భం దాల్చిన మహిళలు మొదటగా తాను గర్భవతి అని తెలుసుకున్న మొదటి నెల నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. ఒకేసారి అధిక మొత్తంలో ఆహారం తీసుకోకుండా వీలైనన్ని సార్లు ఆహారం తీసుకోవడం వల్ల తగినన్ని పోషకాలు శరీరానికి అంది, కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎక్కువ భాగం మహిళలు ఐరన్, క్యాల్షియం, ప్రోటీనులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఎక్కువగా గుడ్లు, పాలు, మాంసం, చేపలు, తాజా పండ్లు కూరగాయలు,వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అదేవిధంగా ప్రతినెల వైద్యుని సంప్రదించి ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలి. గర్భం దాల్చిన మహిళలు వారి శరీరంలో రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే కొన్నిసార్లు స్కానింగ్ వంటివి చేయించుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు బరువు, ఆరోగ్య పరిస్థితి మనం తెలుసుకోవచ్చు.

గర్భం దాల్చిన మహిళలు వీలైనంతవరకు బరువైన పనులను చేయకుండా ఉండాలి. ఈ విధంగా బరువైన పనులు చేయటం వల్ల కొన్ని సార్లు గర్భస్రావమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా పగలు రెండు గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వీలైనంత వరకు మనసుకు నచ్చిన పుస్తకాలు చదువుతూ, పాటలు వింటూ గడపాలి.ఇక దుస్తుల విషయంలో గర్భం ధరించిన మహిళలు ఎప్పుడు వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ జాగ్రత్తలన్నింటిని పాటిస్తూ క్రమం తప్పకుండా మందులను వాడటం వల్ల తల్లి బిడ్డలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే ఈ ఆహారం తప్పనిసరి..!

ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాల రీత్యా ఆఫీసులకు వెళ్లటం వల్ల ఇంట్లో వంటలు చేయడం కుదరక తొందరగా ఫాస్ట్ ఫుడ్ తయారుచేసి పెట్టడం వల్ల పిల్లలు ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. అందువల్ల చిన్న పిల్లలు ఎక్కువగా పోషకాహారం తినడానికి పెద్దగా ఇష్టం చూపించడం లేదు. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల వారిలో పోషకాహారలోపం ఏర్పడుతుంది. ఈ పోషకాహార లోపం వల్ల పిల్లల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.

పిల్లలలో శారీరక ఎదుగుదల ఆగిపోవడంతో పాటు, ఎటువంటి పనులను చేయడానికి కూడా ఆసక్తిని కనబరచరు. పిల్లలను పోషకాహార లోపం నుంచి కాపాడాలి అంటే వారికి సరైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని సరైన సమయంలో తినిపించడం ద్వారా శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. పిల్లలలో శారీరక ఎదుగుదల ఉండాలంటే ఏ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తినిపించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

చిన్నపిల్లల ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే వారికి రోజంతా ఎంతో నీరసంగా అలసిపోయి ఉండటంవల్ల ఎలాంటి పనులను చేయడానికి ఆసక్తి చూపించరు. అందుకోసమే ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, దోసే, ఉప్మా వంటి వాటిని తినిపించాలి. అలాగే స్కూల్ కి వెళ్ళే పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయంలో ఒక గ్లాసు పాలు తాగడం వల్ల రోజంతా ఎంతో చురుగ్గా ఉంటారు. అలాగే మధ్యాహ్న సమయంలో అన్నంతో పాటు తాజా కూరగాయలు పప్పు దినుసుల తో చేసిన కూరలతో కలిపి అన్నం తినిపించాలి.

సాయంత్రం ఒక గ్లాసు పాలను తాపించాలి. ఒకవేళ పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు రాగి మాల్ట్ చేసి తాగించవచ్చు. అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ గా శనగపప్పు గుగ్గిళ్ళు, మరమరాలు, ఉడికించిన వేరుశనగ గింజలు మొదలైన వాటిని తినిపించాలి. అదేవిధంగా రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందు భోజనం తినిపించాలి. రాత్రి భోజనంలో అన్నంతో పాటు కూరలను లేదా చపాతి వంటి వాటిని తినిపించాలి. అదేవిధంగా పడుకునే ముందు ఏదైనా ఒక పండును కచ్చితంగా తినేలా చూసుకోవాలి ఈ విధమైన ఆహారపు అలవాట్లను చేయడం ద్వారా పిల్లలలో శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. పిల్లలను వీలైనంతవరకు చిరుతిళ్ళకు అలవాటు చేయడం మానేయాలి.