Tag Archives: nuvvu nenu

Uday Kiran: రీ రిలీజ్ కి సిద్ధమైన ఉదయ్ కిరణ్ సినిమాలు.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే?

Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయనకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా చిత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే వంటి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు. ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇలా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి ఉదయ్ కిరణ్ కెరియర్ అమాంతం ఆగిపోయింది. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఇలా ఉదయ్ కిరణ్ మరణించినప్పటికీ అభిమానులు ఇప్పటికీ ఈయనని మర్చిపోలేదని చెప్పాలి. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ముఖ్యంగా ఈయన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయినటువంటి నువ్వు నేను మనసంతా నువ్వే చిత్రాలు ఎవర్ గ్రీన్ సినిమాలని చెప్పాలి. ఇక ఉదయ్ కిరణ్ మరణించిన తర్వాత మొదటిసారి ఆయన సినిమాలను తిరిగి థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

మనసంతా నువ్వే…
ఈ క్రమంలోనే తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమాలను తిరిగి మార్చి ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ విడుదల విషయం గురించి ఇంకా అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ సినిమాలను తిరిగి థియేటర్లలో చూడబోతున్నామని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నువ్వునేను ఫేమ్ అనిత కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి..?

ఉదయ్ కిరణ్ నటించిన ‘నువ్వు నేను’ సినిమా హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. ఆ సినిమా లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న అనిత ఓ పండంటి బాబు కు జన్మనిచ్చింది.. తెలుగు లో నటించిన తొలి సినిమా తోనే నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకున్న అనిత కి అవకాశాలు కూడా అలాగే వస్తాయి అనుకున్నారు.. కానీ ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. నువ్వు నేను సినిమా ఉదయ్ కిరణ్ కి అయితే ఎంత అంచి గుర్తింపు వచ్చిందో అంతే మంచి గుర్తింపు అనిత కి కూడా వచ్చింది..

కానీ అనిత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనకపడింది. ఆ సినిమా తర్వాత చాలారోజులకి ఉదయ్ కిరణ్ శ్రీ రామ్ సినిమా లో ఛాన్స్ ఇచ్చాడు.. అప్పటికే ఆమెకున్న ఫేమ్ తగ్గిపోవడంతో ఆ సినిమా లో ఆమె నటించినా ఆమెకు పెద్దగా పేరు రాలేదు.. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో హిందీ, తమిళ భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. అయితే కొన్నాళ్ళు అక్కడ సినిమాలు చేసినా ఆమెకు అదృష్టం పలకరించకపోవడంతో ఆమె తన జీవితంలో నెక్స్ట్ స్టెప్ పెళ్లి చేసుకుంది.. 2013లో అనిత‌, రోహిత్ వివాహం చేసుకున్నారు.

కాగా వీరు ఓ బాబు కు జన్మనిచ్చారు. అక్టోబ‌ర్‌లో త‌న ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు అనిత. ఫిబ్ర‌వ‌రి 9వ తేదిన‌ పండంటి బాబు పుట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత కొన్ని రోజుల‌కే త‌మ కుమారుడిని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశారు అనిత. ఈ బుజ్జాయి కి ఆరవ్ రెడ్డి అని పేరు పెట్టగా ఆ పిల్లాడితో ఉన్న క్షణాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు ఈ దంపతులు.. ఈ క్ర‌మంలో తాజాగా అనిత.. త‌న కుమారుడితో ఆడుకుంటోన్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో త‌న కుమారుడితో బుజ్జి బుజ్జి మాట‌లు మాట్లాడుతోంది అనిత‌. ఈ వీడియో అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.