ఉదయ్ కిరణ్ నటించిన ‘నువ్వు నేను’ సినిమా హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. ఆ సినిమా లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న అనిత ఓ పండంటి బాబు కు జన్మనిచ్చింది.. తెలుగు లో నటించిన తొలి సినిమా తోనే నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకున్న అనిత కి అవకాశాలు కూడా అలాగే వస్తాయి అనుకున్నారు.. కానీ ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. నువ్వు నేను సినిమా ఉదయ్ కిరణ్ కి అయితే ఎంత అంచి గుర్తింపు వచ్చిందో అంతే మంచి గుర్తింపు అనిత కి కూడా వచ్చింది..
కానీ అనిత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనకపడింది. ఆ సినిమా తర్వాత చాలారోజులకి ఉదయ్ కిరణ్ శ్రీ రామ్ సినిమా లో ఛాన్స్ ఇచ్చాడు.. అప్పటికే ఆమెకున్న ఫేమ్ తగ్గిపోవడంతో ఆ సినిమా లో ఆమె నటించినా ఆమెకు పెద్దగా పేరు రాలేదు.. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో హిందీ, తమిళ భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. అయితే కొన్నాళ్ళు అక్కడ సినిమాలు చేసినా ఆమెకు అదృష్టం పలకరించకపోవడంతో ఆమె తన జీవితంలో నెక్స్ట్ స్టెప్ పెళ్లి చేసుకుంది.. 2013లో అనిత, రోహిత్ వివాహం చేసుకున్నారు.
కాగా వీరు ఓ బాబు కు జన్మనిచ్చారు. అక్టోబర్‌లో తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు అనిత. ఫిబ్రవరి 9వ తేదిన పండంటి బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజులకే తమ కుమారుడిని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశారు అనిత. ఈ బుజ్జాయి కి ఆరవ్ రెడ్డి అని పేరు పెట్టగా ఆ పిల్లాడితో ఉన్న క్షణాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు ఈ దంపతులు.. ఈ క్రమంలో తాజాగా అనిత.. తన కుమారుడితో ఆడుకుంటోన్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో తన కుమారుడితో బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతోంది అనిత. ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…