ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో అన్ని రంగాలకు సంబంధిన సేవలు మరియు సమాచారం ఆన్‌లైన్ లో అందుబాటులోకి వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రభుత్వాలు కూడా డిజిటల్ సేవలవైపు మొగ్గు చూపుతున్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సేవల్లో సాంకేతికతను జోడిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో తాజగా రవాణా శాఖ కూడా తమ సేవలను ఆన్‌లైన్ లో అందిస్తోంది. లెర్నర్ లైసెన్స్, లైసెన్స్ రేన్యువల్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి 18 రకాల సేవలను పూర్తిస్తాయిలో ఆన్‌లైన్ అందించనుంది రవాణా శాఖ. ఈ విషయంపై తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది కేంద్ర రవాణా శాఖ. ఈ మేరకు డిజిటల్ సేవలన్నీ మర్చి 3వ తేది నుండి అందుబాటులోకి వచ్చాయి. ఇకపై వాహనదారులు ఆర్టీవో అఫీసులుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఈ సేవలు పొందవచ్చు. అయితే ఈ సేవలు వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది.
* లెర్నర్స్ లైసెన్స్
* డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్
* డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
* డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రంలో చిరునామా మార్పు
* అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్
* వాహన యాజమాన్య హక్కుల బదిలీకి ఎన్‌వోసీ, బదిలీ దరఖాస్తు.
* ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్.
* లైసెన్స్ నుంచి వాహనాలను తొలగించడం.
* తాత్కలిక రిజిస్ట్రేషన్ అప్లికేషన్.
వీటితో పాటు మరికొన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…