వాహనదారులకు గుడ్ న్యూస్ ! ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇకపై ఆన్‌లైన్ లోనే..!

0
133

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో అన్ని రంగాలకు సంబంధిన సేవలు మరియు సమాచారం ఆన్‌లైన్ లో అందుబాటులోకి వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రభుత్వాలు కూడా డిజిటల్ సేవలవైపు మొగ్గు చూపుతున్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సేవల్లో సాంకేతికతను జోడిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో తాజగా రవాణా శాఖ కూడా తమ సేవలను ఆన్‌లైన్ లో అందిస్తోంది. లెర్నర్ లైసెన్స్, లైసెన్స్ రేన్యువల్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి 18 రకాల సేవలను పూర్తిస్తాయిలో ఆన్‌లైన్ అందించనుంది రవాణా శాఖ. ఈ విషయంపై తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది కేంద్ర రవాణా శాఖ. ఈ మేరకు డిజిటల్ సేవలన్నీ మర్చి 3వ తేది నుండి అందుబాటులోకి వచ్చాయి. ఇకపై వాహనదారులు ఆర్టీవో అఫీసులుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఈ సేవలు పొందవచ్చు. అయితే ఈ సేవలు వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఆధార్ అథెంటికేషన్‌ చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది.

ఆన్‌లైన్‌లో లభించనున్న 18 సేవల్లో ముఖ్యమైనవి..

* లెర్నర్స్‌ లైసెన్స్‌
* డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌
* డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌
* డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రంలో చిరునామా మార్పు
* అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌
* వాహన యాజమాన్య హక్కుల బదిలీకి ఎన్‌వోసీ, బదిలీ దరఖాస్తు.
* ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌.
* లైసెన్స్‌ నుంచి వాహనాలను తొలగించడం.
* తాత్కలిక రిజిస్ట్రేషన్‌ అప్లికేషన్‌.

వీటితో పాటు మరికొన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here