Tag Archives: pithapuram

Pawan Kalyan: పవన్ మాటలకు యూటర్న్ తీసుకున్న పిఠాపురం రాజకీయం.. మొదలైన కొత్త తలనొప్పి!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు తనకు తలనొప్పిగా మారుతున్నాయి తాజాగా పిఠాపురంలో నిర్వహించినటువంటి సభలో భాగంగా ఈయన తాను కేంద్రం ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనంటూ కామెంట్లు చేశారు. నిజానికి ఇక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం లోకల్ టిడిపి నేత వర్మకు ఏమాత్రం ఇష్టం లేదు.

పవన్ కళ్యాణ్ కు టికెట్ ప్రకటించడంతో తాను టిడిపి పార్టీ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు పిలిచి తనని బుజ్జగించి ఎమ్మెల్సీలో పదవి ఇస్తానని చెప్పి జనసేనకు సపోర్ట్ చేయాలని కోరారు. దీంతో వర్మ జనసేనకు మద్దతుగా తెలుపుతున్నారు. ఇద్దరు కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాను కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేయవచ్చు అంటూ కామెంట్లు చేశారు.

పిఠాపురం టికెట్ నాదే..
ఒకవేళ నేను కాకినాడ వెళ్లాల్సి వస్తే ఈ ప్లేస్ లో ఉదయ్ పోటీ చేస్తారు అంటూ ఈయన తెలిపారు. దీంతో వర్మ యూటర్న్ తీసుకున్నారు. ఒకవేళ ఈ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకుంటే ఈ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా వేరే వాళ్ళు నిలబడటానికి లేదని తానే పోటీ చేస్తాను అంటూ భీష్ముంచుకు కూర్చున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎంతో బాధతో స్థానాన్ని వదులుకున్నానని.. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీచేస్తే పిఠాపురం టికెట్ తనదేనని అన్నారు.

Ap Politics: ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వర్మ… పవన్ గెలుపు సాధ్యమేనా?

Ap Politics: త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ప్రకటించడంతో ఒక్కసారిగా పిఠాపురం భగ్గుమంది. టిడిపి జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాము కచ్చితంగా ఓడిపోయేలా చేస్తామని వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం జెండాలు ఫ్లెక్సీలను కాల్చి బూడిద చేశారు. ఇలా పొత్తులో భాగంగా పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్నటువంటి వర్మ పై సస్పెన్షన్ వేటు వేశారు.

ఇలా తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో ఎలాగైనా జనసేనని ఓడించే దిశగానే వర్మ అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. కాపులు అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి తిరిగితే సునాయసంగా గెలుపొందొచ్చు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కు పిఠాపురం కేటాయించారు. కానీ ఇక్కడ టిడిపి వర్గీయుల నుంచి వ్యతిరేకత వచ్చింది.

స్వతంత్ర అభ్యర్థిగా వర్మ..
ఇక టిడిపి నేత అయినటువంటి వర్మకు టికెట్ రాకపోవడంతో ఈయనపై సస్పెన్షన్ వేటు పడటంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి వచ్చి పవన్ కళ్యాణ్ పై విజయం సాధిస్తారా లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా నిలబడి పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతారా అనేది తెలియాల్సి ఉంది.

Ramgopal Varma: పిఠాపురం ఎన్నికల బరిలో వర్మ… పవన్ కి పోటీగా నిలబడుతున్నారా?

Ramgopal Varma: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి జరుగుతుంది. మరికొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ప్రజలలోకి వస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు అనే జాబితాలను కూడా విడుదల చేస్తున్నారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్న నేపథ్యంలో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా పవన్ కళ్యాణ్ తాను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటించిన వెంటనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

తాను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే అనుకోకుండా తాను పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తాను కూడా పిఠాపురం నియోజకవర్గంలో నిలబడుతున్నానంటూ ఈయన కామెంట్ చేయడంతో వర్మ ట్వీట్ వెనుక ఉన్న అర్థమేంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

వర్మ సెటైరికల్ ట్వీట్…
ఈయన నిజంగానే పిఠాపురం ఎన్నికల బరిలో దిగబోతున్నారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయగా మరి కొందరు పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఇలాంటి ట్వీట్ చేశారు అంటూ వర్మ చేస్తున్న ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఎలాంటి ఉద్దేశంతో వర్మ ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారనే విషయం తెలియాలి అంటే ఆయనే స్పందించాల్సి ఉంటుంది.

Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ… ఊహించని షాక్ ఇచ్చిన పిఠాపురం వాసులు?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో హీరోగా నటిస్తూనే మరో వైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీని స్థాపించారు అయితే ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలి అన్న ఉద్దేశంతో ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సభలను ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సీట్ల పంపకాలు కేటాయింపులు కూడా పూర్తి అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ తాను ఈసారి భీమవరం గాజువాక నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని వెల్లడించారు.

ఇలా ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయగానే పిఠాపురంలో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు భగ్గుమన్నారు.. పవన్ కళ్యాణ్ కు టికెట్ ఇస్తే కనుక తాము ఓట్లు వేయము అంటూ టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపి పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ కరపత్రాలతో పాటు ఫ్లెక్సీలను చింపేసి మంటలలో కాల్చి వేశారు.

గెలుపు కష్టమేనా…
ఇలా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాననే విషయాన్ని ప్రకటించడం ఆలస్యం వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి ఇలా వీరి వ్యవహార శైలి చూస్తుంటే ఈసారి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అసాధ్యంగానే మారిందని తెలుస్తోంది.