Tag Archives: Plumber

తలుపు తట్టిన అదృష్టం.. రూ. కోటి గెలుచుకున్న ప్లంబర్.. ఎలా అంటే..?

అదృష్టం ఎటు నుంచి తలుపు తడుతుందో తెలియదు. అప్పడే మనం వాటిని అందుకోవాలి.. లేదంటే మరో సారి ఆ అవకాశం రాదు. ఏం చేసినా.. అదృష్టం ఉండాలి అని అంటుంటారు.. ఇది నిజమే. ఎంత కష్టం చేసినా కాస్తంత అదృష్టం ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. లేక పోతే ఎక్కడ నుంచి జీవితం మొదలు పెట్టామో అక్కడే ఉంటాం. అయితే ఇలాంటి లక్ తో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

అతడికి లాటరీ తగిలింది అనుకుంటున్నారా.. కాదు.. అతడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.కోటి గెలుచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ బెట్టింగ్ అంటే ముఖ్యంగా డ్రీమ్ 11 గుర్తుకు వస్తుంది. దీనిలో పాల్గొనే వారు తనకంటూ ఉన్న 22 మంది టీమ్ సభ్యుల్లో 11 మందిని ఎంచుకొని అందులో బెట్టింగ్ పెడతారు.ఇలా అతడు ప్రెడిక్ట్ చేసిన ఓ ప్లంబర్ ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు.

అందులో రూ.30 లక్షలు ట్యాక్స్ కింద పోగా.. రూ.70 లక్షలు తన అకౌంట్లో పడ్డాయని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని కటిహార్‌ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్‌ హంస్‌వర్‌ గ్రామంలో ప్లంబింగ్‌ పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అతడికి తన స్నేహితుడు ఈ డ్రీమ్ 11 గురించి చెప్పాడట.

ఎలా ఆడాలో అతడే నేర్పించాడు. దీంతో మొదటి నుంచి అతడు రూ.200 తో బెట్టింగ్ మొదలు పెట్టాడు. అయితే మొన్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌పై అంటే చెన్నై మరియు ఢిల్లీపై బెట్టింగ్ పెట్టాడు. కోటి రూపాలయలు గెలుచుకున్నాడు. వచ్చిన డబ్బులతో ఓ ఇల్లు కట్టుకుంటానని.. మిగిలిన డబ్బులతో దేవాలయానికి విరాళంగా ఇస్తానన్నాడు.

ఢిల్లీలో దారుణం.. పట్టపగలు మహిళ గొంతు కోసిన దుర్మార్గుడు..

దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేయడానికైనా వెనకాడం లేదు దుండగులు. పట్టపగలు ఓ మహిళను నడిరోడ్డుపై దారుణంగా గొంతకోసి చంపేశాడు. సదరు మహళ కూరగాయల బండి పెట్టుకొని జీవిస్తుంది. రాజపురిలోని సోమ్ బజార్ ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. దీనికి సబంధించి వీడియో అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.

ఢిల్లీలోని డాబ్రి ప్రాంతంలో రద్దీగా ఉండే రాజపురిలోని సోమ్ బజార్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. రాజపురిలోని సోమ్ బజార్ రోడ్డులో విభ (30) అనే మహిళ ఇద్దరు పిల్లలతో చిన్న కూరగాయల షాప్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె దగ్గరకు దిలీప్ అనే వ్యక్తి కూరగాయలు తీసుకొని డబ్బులు చెల్లించలేదు. వాటిని తాను అప్పుగా తీసుకున్నాని పేర్కొన్నాడు.

అప్పు చెల్లించాలని ఆ మహిళ ప్రశ్నించడంతో ఆ వ్యక్తి కత్తితో ఆమె గొంతుకోసినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవ అనంతరం తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది. దీంతో తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు.

ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు అతడి పట్టుకొని చితక్కొట్టారు. ఆమెను అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిదంటూ వైద్యులు వెల్లడించారు. అక్కడ జరిగిన ఈ ఉదంతం మొత్తం సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. గాయపడిని ఆ నిందితుడిని పోలీసులు మొదట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంతో నిండిపోయింది. బాధిత మమిళ చిన్న పిల్లలు అనాథలుగా మారారు.