అదృష్టం ఎటు నుంచి తలుపు తడుతుందో తెలియదు. అప్పడే మనం వాటిని అందుకోవాలి.. లేదంటే మరో సారి ఆ అవకాశం రాదు. ఏం చేసినా.. అదృష్టం ఉండాలి అని అంటుంటారు.. ఇది నిజమే. ఎంత కష్టం చేసినా కాస్తంత అదృష్టం ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. లేక పోతే ఎక్కడ నుంచి జీవితం మొదలు పెట్టామో అక్కడే ఉంటాం. అయితే ఇలాంటి లక్ తో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
అతడికి లాటరీ తగిలింది అనుకుంటున్నారా.. కాదు.. అతడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.కోటి గెలుచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ బెట్టింగ్ అంటే ముఖ్యంగా డ్రీమ్ 11 గుర్తుకు వస్తుంది. దీనిలో పాల్గొనే వారు తనకంటూ ఉన్న 22 మంది టీమ్ సభ్యుల్లో 11 మందిని ఎంచుకొని అందులో బెట్టింగ్ పెడతారు.ఇలా అతడు ప్రెడిక్ట్ చేసిన ఓ ప్లంబర్ ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు.
అందులో రూ.30 లక్షలు ట్యాక్స్ కింద పోగా.. రూ.70 లక్షలు తన అకౌంట్లో పడ్డాయని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని కటిహార్ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్ హంస్‌వర్ గ్రామంలో ప్లంబింగ్ పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అతడికి తన స్నేహితుడు ఈ డ్రీమ్ 11 గురించి చెప్పాడట.
ఎలా ఆడాలో అతడే నేర్పించాడు. దీంతో మొదటి నుంచి అతడు రూ.200 తో బెట్టింగ్ మొదలు పెట్టాడు. అయితే మొన్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌పై అంటే చెన్నై మరియు ఢిల్లీపై బెట్టింగ్ పెట్టాడు. కోటి రూపాలయలు గెలుచుకున్నాడు. వచ్చిన డబ్బులతో ఓ ఇల్లు కట్టుకుంటానని.. మిగిలిన డబ్బులతో దేవాలయానికి విరాళంగా ఇస్తానన్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…