ఎవరికైనా జీవితంలో ఏదైనా బాధపడే ఘటన జరిగితే అస్సలు మర్చిపోలేం. ఏ పని చేద్దామని అనకుకున్నా ఆ ఘటనకు సంబంధించి విషయాలు గుర్తుకు వస్తుంటాయి. అలాంటిది జీవిత భాగస్వామి విషయంలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సమంత, నాగచైతన్య గురించే మాట్లాడుకుంటున్నారు. బయట నాగచైతన్య ప్రీరిలీజ్ ఈవెంట్లకు, సమంత షూటింగ్ లకు అటెండ్ అవుతున్నా.. బయటకు మాత్రమే అలా హ్యాపీగా ఉంటున్నారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఆ బాధ నుంచి బయట పడాలంటే ఎంత లేదన్నా కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే సమంత ఆ గడ్డుకాలాన్ని మర్చిపోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుందట. అందులో ఎక్కువగా జిమ్ కు వెళ్లడం. అవును సమంతకు మొదటి నుంచి జిమ్ చేసే అలవాటు. ఆమెకు జిమ్ అంటే ఎంతో ఇష్టమని చాలాసార్లు చెప్పారు.
ఎంత పని ఉన్నా ఆమె తన బాడీ షేప్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం కూడా ఆ అలవాటును కంటిన్యూ చేస్తోంది. బాయ్స్‌లా డెడ్లీ లిఫ్ట్స్ చేయగల సత్తా సమంత సొంతం. ప్రస్తుతం ఆ ఒత్తిడి నుంచి దూరం అవ్వడానికి కూడా అదే దారి పట్టింది. అంతే కాకుండా.. మళ్లీ కొత్త కథలు వింటుందట. సినిమాల్లో ఎక్కువగా నటించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శాకుంతలం లో ఆమె బిజీగా ఉండగా.. ఇంకా ఎక్కువగా బిజీ అవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఏ ఆఫర్ వచ్చినా చేస్తాను అన్నట్లు సమంత చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఆమె వ్యక్తిగత జీవితం నుంచి పూర్తిగా బయట పడే విధంగా ప్రయత్నం చేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…