Tag Archives: pm kisan scheme

రైతులకు శుభవార్త… పీఎం కిసాన్ 2000 రూపాయలు రైతులకు ఖాతాలో జమ!

కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రైతులకు మరోసారి శుభవార్తను తెలియజేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతుల ఆర్థిక ఎదుగుదలను ఆకాంక్షిస్తున్న మోడీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 6000 రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే 50000 రైతుల ఖాతాల్లోకి ఒకేసారి కాకుండా రెండు వేల చొప్పున మూడు విడతలుగా వేస్తారు. ఈ విధంగా బియ్యం కిసాన్ ద్వారా డబ్బులు వేయటం వల్ల రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుంది.

ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 8 వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ క్రమంలోనే 9న విడుదల రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఈ క్రమంలోనే వచ్చేనెల ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు రైతులకు అకౌంట్లో జమ కావడం వల్ల రైతులు వ్యవసాయ అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఈ పథకంలో చేరని వారు ఉంటే వెంటనే పీఎం కిసాన్ స్కీమ్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో చేరి ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి ఆరు వేల రూపాయలను పొందవచ్చు.

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఎకరాకు 7 వేల రూపాయలు..?

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేయడంతో మోదీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.

రైతుల ధర్నా వల్ల మోదీ సర్కార్ కు చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఏర్పడటంతో కేంద్రం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. రైతులను బడ్జెట్ ద్వారా ఆదుకోవాలని కేంద్రం భావిస్తోందని.. పీఎం కిసాన్ స్కీమ్ నగదు పెంపుతో పాటు సోలార్ పంపు స్కీమ్ గడువును కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పీఎం కుసుమ్ స్కీమ్ కొరకు రెన్యూవబుల్ మినిస్ట్రీ గతంతో పోలిస్తే ఎక్కువగా నిధులను కేటాయించిందని.. ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున కేంద్రం పీఎం కుసుమ్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పీఎం కుసుమ్ యోజన స్కీమ్ ద్వారా రైతులు సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీ ధరకే పొందే అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ను కొనుగోలు చేయడం ద్వారా రైతులు సొంతంగా ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు.

సోలార్ ప్యానెల్స్ ను అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు అదనపు విద్యుత్ ను విక్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 20 లక్షల మంది రైతులు పీఎం కుసుమ్ యోజన స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందుతుండటం గమనార్హం. కేంద్రం బడ్జెట్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ను అమలులోకి తెచ్చి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున ఇవ్వనుందని తెలుస్తోంది.

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ నగదు రూ.10,000కు పెంచే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి సంవత్సరం దేశంలో అర్హులైన రైతులకు 6,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నగదు ఉపయోగపడుతోంది. అయితే కేంద్రం రైతులకు మరో తీపికబురు అందించేందుకు సిద్ధమవుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రం ప్రస్తుతం 6,000 రూపాయలు జమ చేస్తుండగా ఇకపై 10,000 రూపాయలు జమ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రాబోయే బడ్జెట్ లో కేంద్రం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ 2021 సంవత్సరంలో మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశెపెడుతుందో అని దేశంలోని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును 10,000 రూపాయలకు పెంచితే మాత్రం రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. రోజురోజుకు రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. కొన్ని పంటలకు మంచి దిగుబడి వస్తున్నా గిట్టుబాటు ధర లభించడం లేదు. దేశంలోని చాలామంది రైతులకు పీఎం కిసాన్ నగదు సాయం కొంతమేర ఉపయోగపడుతోంది.

బడ్జెట్ పై ప్రజల్లో భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెడుతుందో చూడాల్సి ఉంది. నివేదికలు సైతం పీఎం కిసాన్ నగదును పెంచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి. పీఎం కిసాన్ నగదును నిజంగా పెరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.