Tag Archives: police complaint

Actor Naresh: నటుడు నరేష్ ఇంటి పై దాడి… రమ్య రఘుపతి పై ఫిర్యాదు చేసిన నటుడు నరేష్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఇలా ఈయన రిలేషన్ లో ఉంటూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి వచ్చే పెద్ద ఎత్తున వివాదం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా తన వ్యక్తిగత కారణాలవల్ల నరేష్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ మీడియా వార్తల్లోనూ హాట్ టాపిక్ గా మారారు.ఇకపోతే ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ రమ్య పెట్టే టార్చర్ తాను భరించలేక తనకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. అలాగే ఆమె ఆస్తి కోసమే తనను పెళ్లి చేసుకుందని రమ్య పూర్తిగా డబ్బు మనిషి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రమ్య డబ్బు కోసం తనపై ఓసారి హత్య ప్రయత్నం కూడా చేసిందని నరేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన మరోసారి గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో భాగంగా తన ఇంటి పై దాడి జరగడానికి గల కారణం రమ్య రఘుపతి అంటూ ఆమె పేరును కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Actor Naresh:వాహనాలపై దాడి..

ఈ విధంగా దాడి ఘటనలో భాగంగా నరేష్ కేరవాన్ తో పాటు ఇతర వాహనాల అద్దాలు మొత్తం పగిలిపోయాయని ఈయన తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నరేష్ ఇంటిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇలా రమ్య రఘుపతి తన ఇంటిపై దాడి చేయించింది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలపై రమ్య రఘుపతి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Karate Kalyani: గుడ్డలూడదీసి కొడుతూ యూట్యుబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి… పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!

Karate Kalyani:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి గురించి అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఈమె యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకుంది. ఈ గొడవలో పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

Karate Kalyani: యూట్యూబర్ ,నటి కరాటే కళ్యాణి మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!

కరాటే కళ్యాణి ఈ విధంగా తనతో గొడవ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ రోడ్డుపై ఫ్రాంక్ పేరుతో మహిళలను అవమాన పరుస్తున్నారు. మరికొన్నిసార్లు స్క్రిప్టెడ్ వీడియోస్ తీసి అందులో అడల్ట్ కంటెంట్ తో మహిళలతో ప్రాంక్ చేస్తూ మహిళలను అవమాన పరుస్తున్నారు.

Karate Kalyani: యూట్యూబర్ ,నటి కరాటే కళ్యాణి మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!

ఈ క్రమంలోనే గురువారం రాత్రి కరాటే కళ్యాణి యూసఫ్ కూడా బస్తీ ప్రాంతంలో యూట్యూబర్ శ్రీకాంత్ తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరస్పరం దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీకాంత్ రెడ్డి గాయాలపాలయ్యారు.ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి ఫ్రాంక్ వీడియోల పేరుతో మహిళలను అవమాన పరుస్తున్నారంటూ అతనిని దారుణంగా చితక బాదింది.

ఫ్రాంక్ పేరుతో అవమానం…

ఈ విధంగా వీరిద్దరూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న అనంతరం ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.