Featured

Actor Naresh: నటుడు నరేష్ ఇంటి పై దాడి… రమ్య రఘుపతి పై ఫిర్యాదు చేసిన నటుడు నరేష్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఇలా ఈయన రిలేషన్ లో ఉంటూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి వచ్చే పెద్ద ఎత్తున వివాదం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా తన వ్యక్తిగత కారణాలవల్ల నరేష్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ మీడియా వార్తల్లోనూ హాట్ టాపిక్ గా మారారు.ఇకపోతే ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ రమ్య పెట్టే టార్చర్ తాను భరించలేక తనకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. అలాగే ఆమె ఆస్తి కోసమే తనను పెళ్లి చేసుకుందని రమ్య పూర్తిగా డబ్బు మనిషి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రమ్య డబ్బు కోసం తనపై ఓసారి హత్య ప్రయత్నం కూడా చేసిందని నరేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన మరోసారి గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో భాగంగా తన ఇంటి పై దాడి జరగడానికి గల కారణం రమ్య రఘుపతి అంటూ ఆమె పేరును కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Actor Naresh:వాహనాలపై దాడి..

ఈ విధంగా దాడి ఘటనలో భాగంగా నరేష్ కేరవాన్ తో పాటు ఇతర వాహనాల అద్దాలు మొత్తం పగిలిపోయాయని ఈయన తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నరేష్ ఇంటిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇలా రమ్య రఘుపతి తన ఇంటిపై దాడి చేయించింది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలపై రమ్య రఘుపతి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago