Rashmi Gautam: బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఎంతో మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న రష్మీ పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం అంటే డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ వారి స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగులు వాడితూ ఉంటారు.
ఇలా బూతు పదాలతో రెచ్చిపోతూ ఉండడంతో కొన్నిసార్లు ఈ కార్యక్రమం పై తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో తరచూ ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులకు ఏమాత్రం కొదువ ఉండదు. అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా భార్యాభర్తల స్కిట్ లో భాగంగా భార్యాభర్తలు మాట్లాడుతూ… పిల్లలు పుట్టాలంటే ఇలా కంచం పక్కన ఉంటే సరిపోదు అంటూ డైలాగ్ చెబుతుంటారు.
ఇలా డైలాగ్ చెబుతుండగానే వెంటనే రష్మీ ఈ డైలాగ్ అందుకుని పిల్లలు పుట్టాలంటే మంచం పక్కన ఉండాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.ఇలా రష్మీ ఒక్కసారిగా ఇలాంటి డైలాగు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మల్లెమాలవారు ఎప్పటికీ మారరు టిఆర్పి రేటింగ్స్ కోసం ఇలా బోల్డ్ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…