Movie News

Balayya -Vijayasai Reddy: అలేఖ్య కుటుంబానికి అండగా నిలిచిన బాలయ్య విజయ్ సాయి రెడ్డి… నిజంగా గొప్పోళ్ళు?

Balayya -Vijayasai Reddy: తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబ సభ్యులను అభిమానులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సినిమా ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.అతి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి విధి ఆడుతున్న వింత నాటకంలో తలవంచక తప్పలేదు. ఈ విధంగా తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక నందమూరి తారకరత్న పాదయాత్రలో భాగంగా స్పృహ తప్పి పడిపోవడంతో ఆ క్షణం నుంచి తన వెంటే ఉంటూ ఆయన బ్రతికి రావాలని అహర్నిశలు పోరాడుతూ నిత్యం డాక్టర్లను తన ఆరోగ్యం పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ తనని బ్రతికించడం కోసం ఎంతో కష్టపడ్డారు నందమూరి బాలకృష్ణ. తారకరత్నకు బాలకృష్ణ వరుసకు బాబాయ్ అయినప్పటికీ తనకు తండ్రి సమానులు.పెళ్లి కారణంగా తారకరత్న కుటుంబానికి దూరం కావడంతో బాలకృష్ణ నందమూరి కుటుంబంతో తారకరత్నను కలిపారు. ఈ కారణంతోనే తారకరత్న బాలకృష్ణ మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.

ఇక తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి మరెవరో కాదు వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె. ఇలా అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు.ఆ తారకరత్న అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారని తెలియగానే పార్టీ విభేదాలను పక్కనపెట్టి తారకరత్న కోసం విజయసాయిరెడ్డి కూడా ఎంతో కష్టపడ్డారు. నిత్యం డాక్టర్లకు టచ్ లో ఉంటూ ఈయన ఎప్పటికప్పుడు తారకరత్న పరిస్థితి ఆరా తీసారు.

Balayya -Vijayasai Reddy: అలేఖ్యకు అండగా బాలయ్య… విజయ్ సాయి రెడ్డి

ఈ విధంగా తారకరత్న బ్రతికించుకోవడం కోసం ఒకవైపు తారకరత్న బాబాయ్ బాలకృష్ణ రెడ్డి పెదనాన్న విజయసాయిరెడ్డి ఎంతో కష్టపడినప్పటికీ చివరికి కఠినమైన బాధాకరమైన విషయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.ఇక తారకరత్న మరణించారని వార్త తెలియగానే హుటాహుటిన విజయసాయిరెడ్డి తన నివాసానికి చేరుకొని అక్కడ అన్ని తానే చూసుకున్నారు. పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వారందరినీ స్వయంగా ఆహ్వానించారు. ఇలా తారకరత్న మరణించడంతో అలేఖ్య తన పిల్లల బాగోగులను వీరిద్దరూ చూసుకోబోతున్నట్లు తెలియజేశారు.ఇలా కష్ట సమయంలో వారి మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి అలేఖ్య కుటుంబానికి మద్దతుగా నిలబడటంతో నిజంగా బాలకృష్ణ విజయసాయిరెడ్డి ఇద్దరు ఎంతో గొప్ప మంచి మనసు ఉన్న వాళ్ళని అభిమానులు వీరి వ్యవహార శైలిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

23 hours ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

23 hours ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

23 hours ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

23 hours ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago